Sankranti Special Trains 2024 : ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు – టైమింగ్స్ ఇవే
SCR Sankranti Special Trains: ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. సంక్రాంతి పండగ సమీపిస్తున్న వేళ మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.

SCR Sankranti Special Trains: సంక్రాంతి పండగ వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా… తాజాగా మరికొన్ని రైళ్లను ప్రకటించింది.
ఇక సికింద్రాబాద్ – కాకినాడ మధ్య ప్రత్యేక టైన్ ను ప్రకటించింది. ఈ ట్రైన్ జనవరి 10వ తేదీన సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 7 గంటలకు కాకినాడకు చేరుతుంది. ఈ ట్రైన్ నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతుంది.
ఇక కాకినాడ టౌన్ నుంటి సికింద్రాబాద్ కు కూడా మరో సర్వీస్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైలు జనవరి 11వ తేదీన కాకినాడ నుంచి రాత్రి 9 గంటలకు బయల్దేరి… మరునాడు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
మరోవైపు జనవరి 12వ తేదీన సికింద్రాబాద్ – కాకినాడ మధ్య మరో ట్రైన్ నడపనుంది రైల్వే శాఖ. ఈ ట్రైన్ సాయంత్రం 06.5 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి…. మరునాడు తెల్లవారుజామున 05.30 గంటలకు కాకినాడ చేరుతుంది. ఇక కాకినాడ – తిరుపతి మధ్య జనవరి 13వ తేదీన ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ సాయంత్రం బయల్దేరి… మరునాడు తెల్లవారుజామున 04.30 నిమిషాలకు తిరుపతికి చేరుతుంది.
Telangana State Road Transport Corporation: ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్అర్టిసి ) శుభవార్త తెలిపింది.సంక్రాంతి పండుగ సందర్భంగా 4,484 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచనునట్లు వెల్లడించింది.జనవరి 6 నుంచి జనవరి 15 వరకు హైదరాబాద్ నుంచి కర్ణాటక,ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు.ఈ ప్రత్యేక బస్సులో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామని సంస్థ ఎండీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులను క్షేమంగా వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు అన్నీ ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అయన తెలిపారు.