Sankranti recipes: సంక్రాంతి పండుగకి సకినాలు, అరిసెలు ఇలా సింపుల్ గా చేసేసుకోండి, టేస్ట్ అదిరిపోతుంది
Sankranti recipes: సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా సకినాలు, అరిసెలు చేసుకుని తీరాల్సిందే. ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్ గా ఇలా చేసేసుకోండి.
Sankranti recipes: తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, ఘుమఘుమలాడే పిండివంటలు, ఇంటి నిండా బంధువులు, తోబుట్టువులతో సందడి వాతావరణం నెలకొంటుంది. పండుగ సందర్భంగా రుచికరమైన పిండి వంటలు చేసుకుని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. అరిసెలు, జంతికలు, లడ్డూలు, చెక్కలు వంటి వాటిని చేసుకుని తింటారు.