Sankranthi Fest: సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని స్పెషల్ రైళ్లను ప్రకటించింది. అదనంగా మరో 11 రైళ్లను నడపనున్నట్లు చెప్పింది.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని స్పెషల్ రైళ్లను ప్రకటించింది. అదనంగా మరో 11 రైళ్లను నడపనున్నట్లు చెప్పింది. జనవరి 8 నుంచి 12వ తేదీ మధ్య కాకినాడ-వికారాబాద్, పార్వతీపురం-వికారాబాద్, వికారాబాద్-పార్వతీపురం, సికింద్రాబాద్-పార్వతీపురం, పార్వతీపురం-కాకినాడ టౌన్, కాకినాడ టౌన్-వికారాబాద్ మధ్య రైళ్ళు రాకపోకలు సాగించనున్నాయి. ఆయా రైళ్లలో 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ కోచ్‌లతో సహా సెకండ్ క్లాస్ కోచ్‌లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే రైళ్లకు టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయని రైల్వేశాఖ తెలిపింది