Sankranthi: మనదేశంలో సంక్రాంతికి ఉండే స్పెషల్ వంటకాలు ఇవే, ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్కటి ఫేమస్

 Sankranthi: మనదేశంలో సంక్రాంతికి ఉండే స్పెషల్ వంటకాలు ఇవే, ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్కటి ఫేమస్

Sankranthi: సంక్రాంతికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వంటకాన్ని వండుకుంటారు. కచ్చితంగా వీటిని సంక్రాంతి రోజూ నివేదిస్తారు.

ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా సంక్రాంతి వేడుకలు

ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా సంక్రాంతి వేడుకలు (Unsplash)

Sankranthi: సంక్రాంతి మన దేశంలోనే పెద్ద పండుగ. కేవలం భారత్ లోనే కాదు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో కూడా సంక్రాంతిని నిర్వహించుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల్లోనే కాదు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పెద్ద పండుగ. ప్రతి రాష్ట్రంలోనూ సంక్రాంతి రోజు ప్రత్యేకంగా పిండివంటలు వండుతారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క పిండివంట సంక్రాంతి స్పెషల్‌గా పేరు తెచ్చుకుంది.

నువ్వుల లడ్డులు సంక్రాంతి స్పెషల్ గా చెప్పుకోవాలి. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ బెల్లంతో చేసిన నువ్వుల లడ్డూలను సంక్రాంతికి నివేదిస్తారు. ఉత్తర భారత దేశంలో నువ్వుల లడ్డూలు చాలా ఫేమస్. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లలో వీటిని చేస్తారు.

ఉత్తరాఖండ్లో సంక్రాంతి రోజున కచ్చితంగా తయారు చేసే వంటకం గుగుటియా. దీన్ని బియ్యప్పిండి, బెల్లం మిశ్రమంతో చేస్తారు. అనేక ఆకృతల్లో చేసి నెయ్యిలో ఫ్రై చేస్తారు. ఇది ఒక తీపి వంటకం. ఉత్తరాఖండ్లో ప్రతి ఇంట్లో సంక్రాంతి రోజు ఈ వంటకం ఉండాల్సిందే.

పశ్చిమ బెంగాల్లో మకర సంక్రాంతిని పౌష్ షర్బన్ అని పిలుస్తారు. ఇక్కడ అనేక రకాల వంటకాలు చేస్తారు. వాటిల్లో ప్రత్యేకమైనది తాలెర్ బోరా. దీన్నే తాలేర్ ఫూలూరి అని పిలుస్తారు. ఇది తీయని పదార్థం. గోధుమపిండి రవ్వ, బియ్యప్పిండి, బెల్లం వంటివి కలిపి దీన్ని వండుతారు.

గజాక్

మధ్యప్రదేశ్లో గజాక్ అని పిలిచే నువ్వుల రెసిపీ సంక్రాంతి నాడు ఉండాల్సిందే. నువ్వులు, జీడిపప్పు, నెయ్యి, పంచదార, వేరుశనగలు పలుకులు కలిపి వండుతారు. ఇది తినడం వల్ల శరీరానికి ఉష్ణోగ్రత పెరగడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని అక్కడ వారి నమ్మకం. సంక్రాంతి నైవేద్యంగా దీన్ని రెడీ చేస్తారు.

పంజాబ్ విషయానికొస్తే సంక్రాంతిని లోహ్రీ గా నిర్వహించుకుంటారు. ఆ రోజున చెరుకు పంట చేతికి వస్తుంది. ఆ చెరుకు నుండి తీసిన రసంతో పాయసాన్ని తయారు చేస్తారు. పాయసంలో బాదం, పిస్తా, ఎండు ఖర్జూరాలు, కిస్మిస్లు వంటి డ్రై ఫ్రూట్స్ ను వేసి అందరికీ పంచుతారు.

మహారాష్ట్రలో సంక్రాంతి స్పెషల్ వంటకం బొబ్బట్లు. బొబ్బట్లు అక్కడ పురాణ పోలి అని పిలుస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో బొబ్బట్లు ఎంత ఫేమసో, మహారాష్ట్రల్లో పురాన్ పోలి కూడా అంతే ఫేమస్.

కర్ణాటకలో నువ్వుల లడ్డూలను ‘ఇల్లు బేలా’ అన్న పేరుతో వండుతారు. నువ్వులతో పాటు కొబ్బరి ముక్కలను కూడా ఇందులో కలుపుతారు. ఆ లడ్డూలను అందరికీ పంచుతారు. కర్ణాటకలో ఇది ఒక సంప్రదాయ వంటకం. సంక్రాంతికి కచ్చితంగా చేయాల్సిందే.

గుజరాత్లో సంక్రాంతి రోజు ప్రతి ఇంట్లో ‘ఉండీని’ వండుతారు. ఇది ఒక కూరగా చెప్పాలి. అనేక రకాల కూరగాయలను కలిపి వండుతారు. ఇక్కడ మనం కలగూర ఎలా చేస్తామో, ఇది కూడా అలాంటిదే. పూరీ లేదా సజ్జ రొట్టెతో దీన్ని తింటారు.

ఇక మణిపూర్లో మకర సంక్రాంతి వచ్చిందంటే ‘కాంగ్సుబి’ అని పిలిచే నువ్వుల వంటకం ఉండాల్సిందే. నువ్వులు చెరుకు రసం కలిపి దీన్ని వండుతారు.

ఇది రాష్ట్రంలో మకర సంక్రాంతికి అనేక రకాల వంటకాలు కొలువు తీరుతాయి. ముఖ్యంగా నువ్వులతో చేసే వంటకాలే సంక్రాంతి స్పెషల్ గా చెప్పుకోవాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *