Sabarimala : శబరిమలలో తెలుగువారికి వరుస అవమానాలు..నెక్ట్స్‌ ఏం జరగబోతుంది?

 Sabarimala : శబరిమలలో తెలుగువారికి వరుస అవమానాలు..నెక్ట్స్‌ ఏం జరగబోతుంది?

శబరిమలలో ఈసారి ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు, అలాగే ప్రభుత్వం విఫలమవుతోందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు ఘోర అవమానం ఎదురవుతోంది. గతంలోనూ పలు అవమానాలు ఎదురు కాగా ఈసారి అవి మరింత శృతి మించాయనే ఆరోపణలు వినవస్తున్నాయ

 Sabarimala : శబరిమలలో ఈసారి అయ్యప్ప భక్తుల కోసం చేసిన ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు, అలాగే ప్రభుత్వం విఫలమవుతోందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు ఘోర అవమానం ఎదురవుతోంది. గతంలోనూ తెలుగు భక్తులకు పలు అవమానాలు ఎదురు కాగా ఈసారి అవి మరింత శృతి మించాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.నిజానికి అయ్యప్ప మాల వేసుకునేవారిలో తెలుగువారే ఎక్కువ. శబరిమలకు వచ్చే భక్తులతో పాటు ఆదాయం కూడా తెలుగు రాష్ర్టాల నుంచే ఎక్కువ. అంతే మాల సమయంలో నిష్టగా ఉండటంతో తెలుగువారి తరువాతే ఎవరైనా అనేది సుస్పష్టం. అలాంటిది తెలుగు భక్తులకు శబరిలో వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయి.

గతంతో పోల్చితే ఈ ఏడాది మాలదారుల సంఖ్య రెట్టింపయ్యింది. అందులోనూ తెలుగువారు ఎక్కువమంది మాలలు వేశారు. ఈసారి మాలలు వేసిన వారిలో ప్రతి పదిమందిలో ఆరుగురు కన్నెస్వాములు ఉన్నారంటే మాలధారుల సంఖ్య ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు కాగా అనేక వ్యయా ప్రయాసాలకు ఓర్చి శబరి దర్శనానికి వెళ్తున్న తెలుగువారికి స్థానికులు, పోలీసులు, ఇతర సిబ్బంది నుంచి తీవ్ర అవమానాలు తప్పడం లేదు. ఇటీవల  ఓ పోలీస్‌ అధికారి భక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. భక్తులు కొందరు దారి తప్పి వెళ్తన్న క్రమంలో ఓ పోలీస్‌ అధికారి ఎదురు పడ్డాడు.. దాంతో అతన్ని దర్శనం క్యూ ఎక్కడ అని అడిగినందుకు ప్యాంట్‌ జిప్పు విప్పి అసభ్య సైగలు చేయడం సంచలనంగా మారింది. ఈ మేరకు ఓ భక్తుడు మిగతా స్వాములతో ఆ వీడియోను తీసి నెట్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ అధికారి తీరును ఖండిస్తూ స్వాములు నిరసన చేపట్టగా.. ఇంతలో కొందరు అధికారులు ఆ పోలీసు అతన్ని దొడ్డిదారిన పంపించి రక్షించారని భక్తులు ఆరోపించారు. తెలుగు భాషలో మాట్లాడినందుకే తమకు ఇలాంటి ఘోర అవమానం ఎదురైందని భక్తులు వాపోయారు.

ఇక ఈరోజు శబరిమలలో మరోసాఇ ఉద్రిక్తత నెలకొంది.. తెలుగు రాష్ట్రాల నుంచి దర్శనానికి వెళ్లిన కొందరు అయ్యప్ప భక్తులు ఒక దుకాణంలో నీటి బాటిల్ ధరపై ప్రశ్నించగా, ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా భక్తులలో ఒకరిపై షాపు యజమాని దాడి చేయడంతో  గాయపడినట్లు తెలిసింది. సంఘటన వివరాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన తెలిసిన వెంటనే అక్కడ ఉన్న ఇతర తెలుగు భక్తులు కూడా ఆ దుకాణం వద్దకు చేరుకోవడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. మరోవైపు, చుట్టుపక్కల ఉన్న కొంతమంది దుకాణదారులు కూడా అక్కడికి రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అక్కడికి చేరుకుని భక్తులను, వ్యాపారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.. అయితే, కొందరు భక్తులు పోలీసుల చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు.   ఇవాళ దాడికి గురైన అయ్యప్ప భక్తులు ఆంధ్రప్రదేశ్‌ లోని తిరుపతి ప్రాంతానికి చెందినవారు.. మొత్తం 10 మంది అయ్యప్ప భక్తులు తిరుపతి నుంచి శబరిమల వెళ్లగా.. ఈ ఘటన చోటు చేసుకుంది.. అయితే, వారికి తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులు అంతా మద్దతుగా నిలిచారు..

కాగా, ఈ విషయమై తెలుగు అయ్యప్ప భక్త సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అక్కడి ప్రభుత్వం నిర్లక్ష్యం మూలగానే ఇలా జరుగుతుందని, భవిష్యత్తులో ఇలాగే జరిగితే శబరికి వచ్చే తెలుగువారి సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ర్టాల్లో పలు చోట్ల శబరిని పోలిన, అంతే స్థాయిలో అయ్యప్ప దేవాలయాలు నిర్మితమయ్యాయి. భవిష్యత్తులో తెలుగువారికి అవమానం జరిగితే ఇదే దేవాలయాలకు భక్తులు క్యూ కడుతారని అంటున్నారు. ఇదిలా ఉంటే.. శబరిమలలో ఇతర రాష్ట్రాల భక్తులకు ఈ తరహా చేదు అనుభవాలు ఎదురు కావడం కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అయితే.. ఈసారి భక్తులకు అలాంటి పరిస్థితులు ఎదురు కాబోవని నిర్వాహకులు ఇటు కేరళ ప్రభుత్వం, అటు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(TDB) భరోసా ఇచ్చాయి. అయినా కూడా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *