Rythu Bandhu Funds : ‘రైతుబంధు’ స్కీమ్ అప్డేట్ – రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యేది ఆ రోజే..!
Rythu Bandhu Funds Updates : రబీ సీజన్‌కు సంబంధించిన రైతుబంధు డబ్బుల జమ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వటంతో… రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసేందుకు సిద్ధమైంది.
Rythu Bandhu Funds Updates : రైతుబంధు స్కీమ్ కు సంబంధించి వ్యవసాయశాఖ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. రబీ సీజన్ కు సంబంధించి డబ్బుల జమ అంశంపై ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వటంతో… నిధుల విడుదలకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే ఆయా శాఖల అధికారులతో పాటు… బ్యాంకులతో మాట్లాడింది. ఫలితంగా తెలంగాణలో రైతుబంధు పంపిణీకి అడ్డంకులు తొలగినట్లు అయింది.
ఏడాదికి రెండు సార్లు అన్నదాతలకు రైతుబంధు స్కీమ్ కింద ఆర్థిక సాయం అందజేస్తోంది తెలంగాణ సర్కార్. అయితే అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రబీ సీజన్‌కు సంబంధించి డబ్బుల జమ ప్రక్రియ ఆగిపోయింది.నిధుల విడుదలకు సంబంధించి ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయటంతో… శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో… డబ్బులను జమ చేయనుంది సర్కార్.
నవంబరు 28న జమ…
రైతుబంధు సాయం పంపిణీకి ఈసీ నుంచి అనమతి వచ్చినప్పటికీ… నిధులు ఇంకా జమ కాలేదు. శనివారం, ఆదివారం, సోమవారాలు వరుస సెలవుదినాలు కావడంతో ఈ పక్రియకు బ్రేకులు పడింది. అయితే ఈనెల 28న మంగళవారం రోజున నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియను కూడా 28 లోపే దీన్ని పూర్తి చేయాలని ఆదేశించింది ఎన్నికల సంఘం. దీంతో 28వ తేదీ సాయంత్రం లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే దిశగా వ్యవసాయశాఖ కూడా కసరత్తు చేస్తోంది. ఈ-కుబేర్ పోర్టల్ ద్వారా రాష్ట్రంలో అర్హులైన 70 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి ఆర్థికశాఖకు పంపించాయి. దీనికి అనుగుణంగా ఆర్థికశాఖ రూ.7,700 కోట్లను ట్రెజరీల నుంచి నిధులను బ్యాంకులకు జమ చేయనుంది. ఆ తర్వాత ఈ నిధులు రైతుల ఖాతాల్లోకి జమకానున్నాయి. మంగళవారం ఒక్కరోజే సమయం ఉండటంతో…. ఎలాంటి ఇబ్బందులు రాకుండా సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. గంటల వ్యవధిలోనే డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసేలా చర్యలు చేపట్టింది.
ఈ ఏడాది వానాకాలం పంటకు సంబంధించి 70లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందించింది తెలంగాణ ప్రభుత్వం. 1.5లక్షల మంది పోడు రైతులకు కూడా రైతుబంధు అమలు చేసింది. రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7720.29కోట్లుకు పైగా డబ్బలు జమ అయ్యాయి. 1.54కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే రబీ సీజన్ కు సంబంధించి కూడా 70 లక్షల మందికిపైగా రైతులకు రైతుబంధు సాయం అందే అవకాశం ఉంది.