Rithu chowdary Bigg Boss: నువ్వేం చేసినా నిన్నే చూడాలనిపిస్తుంది పవన్.. చెలరేగిన రీతూ చౌదరి.. ఇద్దరితోనూ ఒకేసారి హవ్వా!!
బిగ్‌బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్‌లకి ఎప్పుడూ లోటు లేదు. ప్రతి సీజన్ ఏదో ఒక లవ్ ట్రాక్ పెట్టి బాగానే నడిపిస్తుంటారు. ఇక ఈ ఏడాది బంపరాఫర్ కొట్టేశాడు బిగ్‌బాస్.. ఏకంగా ట్రయాంగిల్ ట్రాక్ దొరికేసింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్‌తో పులిహోర కలుపుతూ రీతూ చౌదరి బాగానే హింట్లు ఇచ్చింది. తాజాగా వదిలిన ప్రోమోలో వీళ్ల ట్రాక్‌ని ప్రత్యేకంగా కట్ చేసి దీనికి బద్మాష్ పోరి రాధిక అంటూ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వేసి ఇచ్చిపడేశాడు ఎడిటర్.
హైలైట్:
- బిగ్‌బాస్ ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో
- రీతూ చౌదరి ట్రయాంగిల్ ట్రాక్
- ఇద్దరి పవన్‌లతో ఒకేసారి పులిహోర

మరి అంత హింట్ ఇచ్చాక బిగ్‌బాస్ వదలుతాడా ఏంటి.. ఈరోజు ఏకంగా వీళ్ల ట్రయాంగిల్ లవ్ ట్రాక్‌పై ప్రోమో వేసేశాడు. ముందుగా పవన్ కళ్యాణ్ కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ “నువ్వేం చేసినా నిన్నే చూడాలనిపిస్తుంది.. నువ్వు తిడితే తిట్టించుకోవాలనిపిస్తుంది.. నువ్వు నవ్వితే నీతో నవ్వాలనిపిస్తుంది..” అంటూ రీతూ చౌదరి మాములు పులిహోర కలపలేదు. ఇక ఈ మాటలకి మన పవన్ కళ్యాణ్ మెలికలు తిరిగిపోయాడు.
బద్మాష్ పోరి రాధిక
ఆ వెంటనే తనూజ దగ్గరికెళ్లి క్లిప్.. అని పవన్ అడిగితే ఏ క్లిప్ అంటూ తనూజ తెలీనట్లు అడిగింది. నాది అని పవన్ అంటే ఎవరిచ్చారు.. ఇక్కడ పెట్టి తీయగానే ఫీలయ్యావ్.. అంటూ తనూజ కూడా ఏదో గుసగుసలాడింది. ఆ తర్వాత రీతూ పక్కనే పవన్ కళ్యాణ్ కూర్చోగా.. వీళ్లిద్దరికీ దగ్గరిలో డీమాన్ పవన్ కూర్చొని ఉన్నాడు. ఏంటి.. అని పవన్ కళ్యాణ్ అడిగితే నాకు నీ ఫ్రెండ్‌షిప్ వద్దు ఏం వద్దు.. నిన్న హర్ట్ అయింది మళ్లీ మళ్లీ అలా హర్ట్ చేయకు కళ్యాణ్.. ఇప్పుడు 10 మినిట్స్ హర్ట్ అయ్యా నేను నీ వల్ల.. నేను నిజంగా హర్ట్ అవుతా.. అంటూ రీతూ చౌదరి చెప్పింది.
దీంతో పవన్ కళ్యాణ్ అలానే సూటిగా రీతూ కళ్లల్లో చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఇది గమనించి డీమాన్ అక్కడి నుంచి సైడ్ అయిపోయాడు. ఆ తర్వాత రీతూ చౌదరి దగ్గరికెళ్లి నిన్న నువ్వు ఏం చేశావో తెలుశా నీకు.. అంటూ మెలికలు తిరుగుతూ డీమాన్ అడిగాడు. ఏం చేశాను.. అని రీతూ అడిగితే నీటిగా బ్లూ షర్ట్ వేసుకొచ్చాను.. నువ్వు కనీసం పట్టించుకోలే.. అంటూ డీమాన్ అన్నాడు. దీంతో నవ్వుతూ ఏంటి మరి.. అని రీతూ అడిగింది.
ఇంకేముంది “బందూక్ గోలి రాధిక.. బద్మాష్ పోరి రాధిక..” అంటూ టిల్లూలో సాంగ్ వేసి లవ్ ట్రాక్‌ని బాగా ఎడిట్ చేశాడు బిగ్‌బాస్. ఇక నువ్వు నవ్వితే బావుంటావ్.. అంటూ డీమాన్‌కి రీతూ బిస్కెట్లు మాములుగా వేయలేదు. ఇక ఈ అమరప్రేమని చూసి నీకే మేమందరం వెళ్లి తినిపిస్తాం.. నువ్వెళ్లి డీమన్‌కి తినిపిస్తున్నావ్.. అంటూ ఇమ్మూ డైలాగ్ కొట్టాడు. ఇక ప్రోమో చివరిలో డీమాన్-రీతూ మాట్లాడుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ సీరియస్‌గా వీళ్లవైపు చూస్తున్నాడు.
ఇలా ప్రోమో అయితే మాములుగా లేదు. బిగ్‌బాస్ సీజన్-4లో ఎలా అయితే మోనాల్-అభిజిత్-అఖిల్ మధ్య ట్రయాంగిల్ లవ్ ట్రాక్ వర్కవుట్ చేశారో.. మళ్లీ ఇప్పుడు అలానే వీళ్ల ముగ్గురి మధ్య నడిపిస్తున్నట్లుగా ఉంది. మరి ఇది ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి.