Revanth Reddy: తెలంగాణ గ్రూప్‌-2 ఎగ్జామ్‌పై క్లారిటీ వచ్చేసింది.. సీఎం రేవంత్‌ రెడ్డి ఏమన్నారంటే..?

 Revanth Reddy: తెలంగాణ గ్రూప్‌-2 ఎగ్జామ్‌పై క్లారిటీ వచ్చేసింది.. సీఎం రేవంత్‌ రెడ్డి ఏమన్నారంటే..?

Telangana Jobs : తెలంగాణలో ఉద్యోగ నియామక ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇదే క్రమంలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ సైతం రాజీనామా చేశారు.

Telangana CM Revanth Reddy – TSPSC Group 2 Exam : తెలంగాణలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్‌ చెప్పారు. త్వరలోనే టీఎస్‌పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి రేపటి నుంచి ప్రారంభం కాబోయే ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..

రాష్ట్రంలో ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. అయితే.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదు. టీఎస్‌పీఎస్సీ సభ్యులు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు. గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నాక కొత్త బోర్డును ఏర్పాటు చేసి చైర్మన్‌, సభ్యులను నియమిస్తాం.

అనంతరం ఉద్యోగ నియామకాలు చేపడతాం. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌- 2 పరీక్షలపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తాజా పరిణామాలను గమనిస్తే.. గ్రూప్‌-2 పరీక్ష మరోసారి తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉంది. అయితే.. ఈ అంశంపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు గ్రూప్-2 ఎక్సామ్ పోస్ట్‌పోన్‌ అయిన విషయం తెలిసిందే. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ సహా పలువురు సభ్యులు రాజీనామా చేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిసన్ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కాగా.. తెలంగాణలో గ్రూప్-2 పరీక్షకు సంబంధించి 783 పోస్టులకు 5 లక్షల 50 వేల మంది అభ్యర్థుల దరఖాస్తు చేసుకున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *