Pushpa 3: బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..’పుష్ప-3′ కన్ఫర్మ్,టైటిల్ ఇదే

‘పుష్ప’ పార్ట్-3 ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. ‘పుష్ప-3 ది ర్యాంపేజ్’ అనేది టైటిల్. తాజాగా ఎడిటింగ్ రూమ్ లో దిగిన ఫొటోను చిత్రయూనిట్ షేర్ చేయగా అందులో వెనకాల ‘పుష్ప-3’ పోస్టర్ ఉండటం గమనార్హం. ఈ పోస్టర్ తో ‘పుష్ప-3’ కూడా ఉండబోతుందని స్పష్టమవుతుంది.
సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప2’ మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
ది ర్యాంపేజ్..
ఇదిలా ఉంటే పుష్ప-2 తో పాటూ పార్ట్-3 కూడా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ చెబుతూ వచ్చారు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ లో కూడా సుకుమార్ ‘పుష్ప-3’ గురించి హింట్ ఇచ్చాడు. అయితే ‘పుష్ప-3’ కూడా ఉండనుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ‘పుష్ప-2’ టైటిల్ ఎండ్ కార్డులో ‘పుష్ప -3.. ది ర్యాంపేజ్’ అని పోస్టర్ రివీల్ చేస్తారని తెలిపాయి.
తాజాగా ఎడిటింగ్ రూమ్ లో దిగిన ఫొటోను చిత్రయూనిట్ షేర్ చేయగా అందులో వెనకాల ‘పుష్ప – 3’ పోస్టర్ ఉండటం గమనార్హం. ఈ పోస్టర్ తో ‘పుష్ప-3’ కూడా ఉండబోతుందని స్పష్టమవుతుంది. అయితే పార్ట్-3 ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది, ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.