Pulivendula: ముగిసిన ఓటింగ్.. పులివెందులలో వార్ వన్ సైడ్.. ఆ పార్టీదే విజయం?
హోరాహోరీగా సాగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొద్ది సేపటి క్రితం ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు పులివెందులలో 74.57 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఒంటిమిట్టలో 70 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హోరాహోరీగా సాగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొద్ది సేపటి క్రితం ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు పులివెందులలో 74.57 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఒంటిమిట్టలో 70 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో జరుగుతున్న ఈ ఎన్నికను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికార టీడీపీ సైతం జగన్ కంచుకోటలో పాగా వేయాలన్న లక్ష్యంతో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని బరిలోకి దించింది. టీడీపీ తరఫున బీటెక్ రవి, మాధవి రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తదితరులు ప్రచారం నిర్వహించారు.
గెలుపు మాదే: టీడీపీ
వైసీపీ తరఫున ఎంపీ అవినాష్ రెడ్డి ప్రచారం చేశారు. అయితే.. పోలింగ్ సరళిని బట్టి చూస్తే గెలుపు తమదేనని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో వై నాట్ కుప్పం అంటూ.. కామెంట్లు చేసిన వైసీపీకి ఈ ఎన్నికతో గట్టి కౌంటర్ ఇచ్చామంటున్నారు. వై నాట్ పులివెందుల అంటూ ప్రకటనలు చేస్తున్నారు.