Puja: పూజతో మెదడుకు మేలు..!! అధ్యయనం ఏం చెబుతుందో మీరూ తెలుసుకోండి

 Puja: పూజతో మెదడుకు మేలు..!! అధ్యయనం ఏం చెబుతుందో మీరూ తెలుసుకోండి

పూజలు, ధ్యానం వంటి ఆధ్యాత్మిక పద్ధతులు కేవలం మతపరమైన కర్మలు మాత్రమే కాదు. అవి మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ధ్యానం, పూజ వంటివి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి, జీవితంపై సానుకూల దృక్పథాన్ని పెంచుతాయి.

పూజ అనేది ఒక పవిత్రమైన హిందూ ఆచారంగా, దేవుడిని లేదా దేవతలను భక్తితో ఆరాధించే ప్రక్రియ. ఇది కేవలం మతపరమైన క్రియ మాత్రమే కాదు.. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి.. ఆత్మశుద్ధి చేసుకోవడానికి ఒక మార్గం. పూజలో మంత్రాలు చదవడం, పాటలు పాడడం, పండ్లు, పువ్వులు, ధూపం, దీపాలు సమర్పించడం వంటివి ఉంటాయి. ప్రతి పూజ వెనుక ఒక విశిష్టమైన ఉద్దేశ్యం ఉంటుంది. అది ఏదైనా కోరిక నెరవేరడం కోసం కావచ్చు, ఇంట్లో సుఖశాంతులు ఉండాలని కావచ్చు, లేదా కేవలం భగవంతుడికి మన కృతజ్ఞతను తెలియజేయడానికి కావచ్చు. ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతూ.. హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచి ఉంది. పూజలు, ధ్యానం వంటి ఆధ్యాత్మిక పద్ధతులు కేవలం మతపరమైన కర్మలు మాత్రమే కాదు. అవి మీ మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. తరచుగా మనం పూజలు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుందని వింటుంటాం. అయితే ఈ వాదన వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పూజ మెదడును పదును పెడుతుందో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ప్రార్థనతో మెదడుకు శక్తి..

మెదడును స్కాన్ చేసే MRI టెక్నాలజీ.. మానసిక అధ్యయనాలు దీనిపై కీలక విషయాలు బయటపెట్టాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్నవారి మెదడు మరింత ఆరోగ్యంగా, బలంగా ఉంటుందని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. ధ్యానం, ప్రార్థన వంటి అలవాట్లు మెదడులోని భావోద్వేగాలు, ఆలోచనా సామర్థ్యాలను నియంత్రించే భాగాలను చురుకుగా ఉంచుతాయి. ఈ చర్యల వల్ల ఒత్తిడి, నిరాశ వంటి సమస్యల నుంచి వేగంగా కోలుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అభ్యాసాలు మెదడులోని ఉత్పాదక వ్యవస్థను బలపరుస్తాయి. దీని వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనా శక్తి మెరుగుపడతాయి. ఆధ్యాత్మికతను పాటించేవారు మత విశ్వాసాలు కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక ఆలోచనలు, మానసిక ప్రశాంతత మెదడుకు చాలా లాభదాయకమని నిపుణులు చెబుతున్నారు.


ధ్యానం, పూజ వంటివి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి, జీవితంపై సానుకూల దృక్పథాన్ని పెంచుతాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన మెదడుకు చాలా అవసరం. కాబట్టి పూజలు, ధ్యానం వంటివి కేవలం మతపరమైన ఆచారాలుగా మాత్రమే కాకుండా.. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే సాధనాలుగా చూడాలి. ఈ అభ్యాసాలు మీ మెదడును చురుకుగా, ఆరోగ్యంగా, ఒత్తిడి లేకుండా ఉంచుతాయి. దీన్ని ఒక అలవాటుగా మార్చుకోవడం ద్వారా మానసికంగా, శారీరకంగా కూడా ఎంతో మేలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *