Priyanka gandhi: పెళ్లి పీటలెక్కనున్న ప్రియాంక గాంధీ కొడుకు..

 Priyanka gandhi: పెళ్లి పీటలెక్కనున్న ప్రియాంక గాంధీ కొడుకు..

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంగ గాంధీ కొడుకు రేహాన్ వాద్రా మరికొన్నిరోజుల్లో పెళ్లి పీటలెక్కనున్నారు. తాజాగా ఆయనకు ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రేహాన్ స్నేహితురాలు అవీవా బేగ్‌తో నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంగ గాంధీ కొడుకు రేహాన్ వాద్రా మరికొన్నిరోజుల్లో పెళ్లి పీటలెక్కనున్నారు. తాజాగా ఆయనకు ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రేహాన్ స్నేహితురాలు అవీవా బేగ్‌తో నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం కూడా వీళ్లిద్దరూ కలిసి దిగిన ఓ ఫొటోను అవీవా తన ఇన్‌స్టా స్టోరీ పెట్టారు.  ఆ తర్వాత అదే ఫొటోను హైలెట్స్‌ సెక్షన్‌లో పెట్టారు. అందుకే వీళ్లిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగనట్లు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. రేహాన్‌, అవీవా ఏడేళ్ల నుంచి స్నేహితులు. వీళ్ల పరిచయం ప్రేమగా మారింది. ఇటీవలే అవీవాకు రేహాన్‌ పెళ్లి ప్రపోసల్ రాగా ఆమె దీనికి అంగీకరించినట్లు సమాచారం.

వీళ్లీద్దరిదీ లవ్‌ మ్యారెజ్‌కు ఇరుకుటుంబాలు అంగీకరించి ఎంగేజ్‌మెంట్ జరిపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ప్రియాంక గాంధీ, రాబర్ట్‌ వాద్రా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. అవీవా కుటుంబ సభ్యులు ఢిల్లీకి చెందినవాళ్లని, వాద్రా ఫ్యామిలీతో వీళ్లకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

రేహాన్ వాద్రా విజువల్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారు. స్ట్రీట్, కమర్షియల్, వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో ఢిల్లీలోని బికనేర్‌ హౌస్‌లో డార్క్‌ పర్సెప్షన్ పేరుతో తొలి ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. మరో విషయం ఏంటంటే అవీవా కూడా ఫొటోగ్రాఫర్‌ కావడం విశేషం. ఓపీ జిందాల్‌ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి ఆమె జర్నలిజం అండ్ కమ్యూనికేషన్స్‌ పూర్తి చేశారు. అంతేకాదు ఏ ఫొటోగ్రఫిక్ స్టూడియో, ప్రొడక్షన్‌ సంస్థకు కో ఫౌండర్‌గా కూడా ఉన్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *