Prabhas: 300 కోట్లకుపైగా కొల్లగొట్టిన టాప్ 10 హీరోలు.. ఒకే ఒక్కడుగా ప్రభాస్, ఏకంగా ఐదుసార్లు!

 Prabhas: 300 కోట్లకుపైగా కొల్లగొట్టిన టాప్ 10 హీరోలు.. ఒకే ఒక్కడుగా ప్రభాస్, ఏకంగా ఐదుసార్లు!

Prabhas South Hero Record Of 300 Cr: బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లు కొల్లగొట్టిన నటుల్లో సౌత్ నుంచి ఏకైక హీరోగా ప్రభాస్ రికార్డ్ సృష్టించాడు. ఏకంగా 5 సినిమాలు 300కుపైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి సౌత్‌లోనే ఒకే ఒక్కడుగా ప్రభాస్ నిలిచాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Top 10 Actors With 300 Cr Grossers: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా సినిమా సలార్ బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. కలెక్షన్లతో మాస్ ర్యాంపేజ్ సృష్టిస్తోంది. సలార్ మూవీకి ఇప్పటివరకు మూడు రోజుల్లో రూ. 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో రూ. 300కుపైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన హీరోలు, వారి సినిమాలు ఏంటనేది ఆసక్తిగా మారింది.

ఐదో సినిమాగా సలార్

ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి, బాహుబలి 2, సాహో, ఆదిపురుష్ సినిమాలు రూ. 300, రూ. 350 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకుని సంచలనం సృష్టించాయి. బాహుబలి, బాహుబలి 2 తప్పా మిగతా సినిమాలకు టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల పరంగా మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఇప్పుడు ఐదో సినిమాగా సలార్ నిలిచింది.

ఏకైక దక్షిణాది హీరో

అయితే ఈ ఐదు సినిమాల మధ్యలో రాధేశ్యామ్ ఒక్కటి మాత్రం అటు టాక్ పరంగా, ఇటు బాక్సాఫీస్ లెక్కల్లో నిరాశపరిచింది. ఈ సినిమా కూడా 300 కోట్లు కొల్లగొట్టి ఉంటే వరుసగా ఆరు సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ కొట్టేవాడు ప్రభాస్. ఇప్పుడు కూడా ఐదు సినిమాలతో 300 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఏకైక సౌత్ హీరోగా ప్రభాస్ అరుదైన రికార్డ్ సాధించాడు.

టాప్ 10 హీరోల జాబితా

ప్రభాస్ ఐదు సినిమాలు 300 కోట్ల మార్క్ దాటితే.. సౌత్ నుంచి దళపతి విజయ్ 3 సార్లు, రజనీకాంత్ 2 సార్లు ఈ ఫీట్ సాధించారు. ఇలా 300కోట్లుకు పైగా కోట్లు కొల్లగొట్టిన టాప్ 10 హీరోలు ఎవరని చూస్తే..

1. సల్మాన్ ఖాన్- 9

3. షారుక్ ఖాన్- 5 + 1 (త్వరలో డంకీ కూడా అందుకునే అవకాశం ఉంది)

4. ప్రభాస్- 5

5. రణ్‌బీర్ కపూర్ – 4

6. రణ్‌వీర్ సింగ్- 4

7. విజయ్- 3

8. అజయ్ దేవగణ్- 3

9. హృతిక్ రోషన్- 3

10. అక్షయ్ కుమార్- 3

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *