Pan Card: పాన్ కార్డు ఉన్నవారికి సూపర్ ఛాన్స్.. ఫొటో, డిజిటల్ సిగ్నేచర్ నిమిషాల్లోనే మార్చుకోవచ్చు.. సింపుల్‌గా ఇలా
పాన్ కార్డు అంటే కేవలం ఒక గుర్తింపు కార్డుగానే చాలామంది చూస్తారు. కానీ ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్‌తో పాటు దేశంలో ప్రతీ ఆర్ధిక లావాదేవీకి ఇది కీలకమైన గుర్తింపు పత్రం. అందుకే ఇందులో మీ పేరు, డేట్ ఆఫ్ బర్డ్, ఫొటో, డిజిటల్ సిగ్నేచర్, తండ్రి పేరు వివరాలు కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి.
Pan Card: పాన్ కార్డు ఉన్నవారికి సూపర్ ఛాన్స్.. ఫొటో, డిజిటల్ సిగ్నేచర్ నిమిషాల్లోనే మార్చుకోవచ్చు.. సింపుల్‌గా ఇలా
దేశంలో ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించాలంటే పాన్ కార్డు అనేది తప్పనిసరి అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ డాక్యుమెంట్ లేకపోతే ఎలాంటి ఆర్ధిక సర్వీసులు పొందలేము. బ్యాంక్ అకౌంట్ పొందటం దగ్గర నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ వరకు ప్రతీ పనికి ఇది అవసరమే. దీంతో పాన్ కార్డులోని వివరాలు సరిగ్గా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తప్పుగా ఉంటే సులువుగా మార్చుకోవచ్చు. పాన్ కార్డు సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే వివరాలను మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. ఈ డిజిటల్ సేవల ద్వారా మీరు పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫొటో, డిజిటల్ సిగ్నేచర్, తండ్రి పేరు లాంటి వివరాలు అన్నీ మార్చుకోవచ్చు. అలాగే ఈ-పాన్ పీడీఎఫ్ ఫైల్‌ను సెకన్లలోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫొటో, డిజిటల్ సంతకాన్ని ఎలా మార్చుకోవాలో ఒకసారి చూద్దాం.
ఫొటోను మార్చుకోవడం ఎలా అంటే..?
-NSDL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి -ఛేంజెస్ లేదా కరెక్షన్ ఇన్ ఎగ్జిటింగ్ పాన్ డేటా అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి -అప్లికేషన్ టైప్‌లో Individual’ అనే కేటగిరిని ఎంచుకోండి -మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, పాన్ నెంబర్ ఎంటర్ చేయండి -ఫారంను సబ్మిట్ చేయండి -ఈ-పైన్ ప్రాసెస్ ద్వారా స్కాన్‌డ్ కాపీస్ సబ్మిట్ చేయడం లేదా ఫిజికల్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి -ఐడెంటిటీ ప్రూప్, అడ్రస్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్, పాన్ కాపీ, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, స్కాన్‌డ్ సిగ్నేచర్ అప్‌లోడ్ చేయండి -యూపీఐ, క్రెడిట్, బెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేసి అక్‌నాలెడ్జ్‌మెంట్ కాపీని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి.
డిజిటల్ సిగ్నేచర్ అప్డేట్ చేసుకోవడమెలా..?
-ఎన్ఎస్‌డీఎల్ పోర్టల్‌కు వెళ్లండి -చేంజెస్ లేదా కరెక్షన్ ఇన్ ఎగ్జిటింగ్ పాన్ డేటా ఆప్షన్‌పై క్లిక్ చేయండి -పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, పాన్ నెంబర్ ఎంటర్ చేయండి -ఈ-సైన్ ప్రాసెస్ ఆప్షన్‌ను ఎంచుకోండి ఆధార్‌తో పాటు మిగతా వివరాలు నమోదు చేయండి -సిగ్నేచర్ మిస్‌మ్యాచ్ బాక్స్‌పై క్లిక్ చేయండి -తల్లిదండ్రుల వివరాలు నమోదు చేయండి -ఐడెంటిటి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ కాపీతో పాటు కొత్త సిగ్నేచర్ కాపీని అప్‌లోడ్ చేయండి -డిజిటల్ విధానంలో పేమెంట్ చేసి ప్రొసీడ్ అవ్వండి -అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ను అప్ లోడ్ చేయండి