Palmyra Sprout: తేగలు తింటే.. మీ ఎముకలు బలంగా అవ్వడమే కాదు.. షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!

 Palmyra Sprout: తేగలు తింటే.. మీ ఎముకలు బలంగా అవ్వడమే కాదు.. షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!

Tender Palm Shoots:తేగలు.. శీతాకాలంలోనే దొరికే సీజనల్‌ ఫుడ్‌. తేగలు మన ఆహారంలో చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

Palmyra Sprout: తేగలు తింటే.. మీ ఎముకలు బలంగా అవ్వడమే కాదు.. షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!
Tender Palm Shoots: తేగలు.. పల్లెటూరిలో పుట్టి, పెరిగిన వారికి వీటి గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. తెలంగాణలో వీటిని గేగులని కూడా పిలుస్తుంటారు. తాటికాయల్లో టెంకలు ఉంటాయి. వాటిని తీసి మట్టిలో పాతితే మొలక వస్తుంది. ఆ మొలకలే తేగలు. శీతాకాలంలో తేగలు ఎక్కువగా దొరుకుతాయి. వీటిని కాల్చుకుని తిన్నా, ఉడకబెట్టుకుని తిన్నా యమ టేస్ట్‌గా ఉంటాయి. తేగలు తింటే ఆరోగ్యానికీ ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

తేగల్లో పొటాషియం, విటమిన్ బి1, బి2, బి3, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఫైబర్‌, క్యాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ లభిస్తాయి. ఇవి పోషకాల లోపాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా ఇందులోని విటమిన్‌ సి తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచి, వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. తేగల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. జీర్ణ క్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది.

ఎముకలు బలంగా ఉంటాయి..

తేగలలో కాల్షియం సమృద్దిగా ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలంగా ఉంచుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గించడానికీ.. తేగలు సహాయపడతాయి.

షుగర్‌ పేషెంట్స్‌కు మంచిది..

తేగల్లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. షుగర్‌ పేషెంట్స్‌ తేగలు తింటే.. బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి. తేగల్లో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. రోజుకొక తేగ తింటే.. రక్తహీనత దూరం అవుతుందని నిపుణులు అంటున్నారు.

బరువు తగ్గుతారు..

మీరు బరువు తగ్గాలనుకుంటే.. కచ్చితంగా తేగలను తీసుకోండి. వీటిల్లో పిండిపదార్థాలతో పాటూ ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఫైబర్‌ కడుపును నిండుగా ఉంచుతుంది, అతిగా తినకుండా నిరోధిస్తుంది. దీంతో బరువు కంట్రోల్‌లో ఉంటుంది. తేగలు తింటే పెద్దపేగుల్లో మలినాలను చేరకుండా చేస్తుంది. టాక్సిన్లను తొలగిస్తుంది.

హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది..

తేగల్లో మెగ్నీషియం సమృద్దిగా ఉంటుంది. ఇది హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. గుండె సమస్యల ముప్పును తగ్గిస్తుంది. అలాగే నరాల బలహీనత, నరాలలో అడ్డంకులు తొలగిస్తుంది. నరాలను అరోగ్యంగా ఉంచుతుంది.

(image source – pixabay)

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *