Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. పవన్ కల్యాణ్ సంచలన పోస్ట్!
ఆపరేషన్ సిందూర్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. త్రివిధ సైన్యాల ధైర్య నాయకత్వానికి మరియు వారికి అండగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు.. అంటూ తన X ఖాతాలో పోస్ట్ చేశారు
ఆపరేషన్ సిందూర్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ధైర్యం లేని చోట ధర్మం నశిస్తుంది. ధైర్యం లేని చోట స్వార్థమే విజయం సాధిస్తుంది. దశాబ్దాల తరబడి సహనమే… సహనమే! చాలాసేపు నిశ్శబ్దాన్ని భరించిన తర్వాత, “ఆపరేషన్ సిందూర్” ద్వారా భారతదేశం మొత్తాన్ని మళ్ళీ శౌర్య స్ఫూర్తితో నింపిన త్రివిధ సైన్యాల ధైర్య నాయకత్వానికి మరియు వారికి అండగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు ” అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు పవన్ కల్యాణ్.