New year 2024 tips: కొత్త ఏడాది ఏయే రాశుల వాళ్ళు ఏ పనులు చేస్తే అదృష్టం వరిస్తుందంటే..
New year tips: నూతన సంవత్సరం కొన్ని పనులు చేయడం వల్ల డబ్బుకు ఏ లోటు ఉండదు. ఆర్థికంగా బలపడతారు
New year tips: కొత్త సంవత్సరమైన కలిసి రావాలని చాలా మంది దేవుళ్ళకి పూజలు చేస్తారు. పాత సంవత్సరంతోనే తమ కష్టాలు తొలగిపోయి కొత్త ఏడాది సరికొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటారు. ఎన్నో కొత్త ఆశలతో ఎదురుచూస్తారు. కొన్ని పనులు చేయడం వల్ల డబ్బు, అదృష్టం, శ్రేయస్సు లభిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. కొత్త సంవత్సరం అంతా మంచే జరగాలని అనుకుంటే ఏయే రాశుల వాళ్ళు ఏయే పనులు చేస్తే ఇబ్బందులు తొలగించుకోవచ్చో చూద్దాం.
మేష రాశి
మేష రాశి వాళ్ళు కొత్త సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాగించాలని అనుకుంటే ఒక కొబ్బరి కాయని ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఇంట్లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కొత్త సంవత్సరంలో వచ్చే ఒడిదుడుకుల నుంచి ఉపశమనం పొందుతారు.
వృషభ రాశి
ఇంట్లో సానుకూలత, దేవుని ఆశీర్వాదం పొందాలని అనుకుంటే వృషభ రాశి వాళ్ళు ప్రతి శుక్రవారం గుడిలో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభించి ఆర్థికంగా బాగుంటారు. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి కొత్త ఏడాది కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. చేతిలో డబ్బు నిలవకపోయినా, డబ్బు పొదుపు చేయలేకపోయినా ఎరుపు రంగు వస్త్రంలో తామర పువ్వుని చుట్టి పూజ గదిలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు.
కర్కాటక రాశి
ఈ రాశి వాళ్ళు కొత్త సంవత్సరంలో ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే పరమ శివుడిని పూజించాలి. రుద్రాక్ష జపమాలతో ఓం నమః శివాయ మంత్రాన్ని పారాయణం చేయాలి. ఇలా చేస్తే జీవితంలో సానుకూలత, ఆర్థిక శ్రేయస్సు పొందుతారు.
సింహరాశి
సింహ రాశి వాళ్ళు కొత్త సంవత్సరంలో ఆర్థికంగా బలపడాలంటే రాత్రి సమయంలో ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించాలి. ఇంట్లో ఎలాంటి ప్రతికూల శక్తులు ఉన్నా, ఒడిదుడుకులు ఏర్పడినా తొలగిపోతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. అదృష్టం వరిస్తుంది.
కన్య రాశి
కన్యారాశి వాళ్ళు కొత్త సంవత్సరంలో దుర్గాదేవిని పూజిస్తే అంతా మంచే జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు వీరికి ఎల్లప్పుడూ ఉంటాయి. ధన సంపదతో పాటు ఆరోగ్య పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
తుల రాశి
ఈ రాశి వాళ్ళు దుర్గామాతని పూజిస్తే అన్నింటా విజయం సాధిస్తారు. శని దోష నివారణ కోసం రుద్ర చండీ పారాయణం చేస్తే మంచిది. ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి.
వృశ్చిక రాశి
కొత్త ఏడాది వృశ్చిక రాశి వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడాలంటే హనుమంతుడిని పూజించాలి. కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటే ఏడు బాదం పప్పులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఆంజనేయ స్వామికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా సజావుగా సాగుతాయి.
ధనస్సు
నూతన సంవత్సరంలో భద్రత, ఆర్థికలాభం కోసం బంగలాముఖి అమ్మవారికి పసుపు ముద్ద సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి దయ మీపై ఉంటుంది. మీ సమసలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది.
మకరం రాశి
మకర రాశి వారికి వ్యాపారంలో బాగా కలిసి రావాలంటే ప్రతి శనివారం రోజు నూనె రాసిన రొట్టెను నల్ల కుక్కకి పెట్టాలి. ఇలా చేస్తే వ్యాపారంలో ఆర్థికంగా బలపడతారు. కుటుంబంలో బంధాలు బలపడతాయి.
కుంభ రాశి
ఈ రాశి వాళ్ళు అప్పులతో బాధపడుతుంటే గణపతిని పూజించాలి. పసుపు ముడుల హారాన్ని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా బలపడతారు.
మీన రాశి
ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే కొత్త సంవత్సరంలో చతుర్థి నాడు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. వినాయకుడి ఆశీర్వాదంతో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థికంగా పుంజుకుంటారు.