Nara Lokesh : నారా లోకేశ్ కు వైఎస్ షర్మిల క్రిస్మస్ గిఫ్ట్, థ్యాంక్స్ చెబుతూ లోకేశ్ పోస్ట్!

 Nara Lokesh : నారా లోకేశ్ కు వైఎస్ షర్మిల క్రిస్మస్ గిఫ్ట్, థ్యాంక్స్ చెబుతూ లోకేశ్ పోస్ట్!

Nara Lokesh : నారా లోకేశ్ వైఎస్ షర్మిల ధన్యవాదాలు తెలిపారు. లోకేశ్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు. ఈ మేరకు లోకేశ్ ఎక్స్ లో థ్యాంక్స్ చెబుతూ పోస్టు పెట్టారు.

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు అనుకోని అతిథి నుంచి క్రిస్మస్ గిఫ్ట్ అందింది. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నారా లోకేశ్ కు క్రిస్మస్ గిప్ట్ పంపారు. వైఎస్ఆర్ కుటుంబం నుంచి లోకేశ్ ఫ్యామిలీకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ నోట్ పంపించారు. తనకు గిఫ్ట్ పంపినందుకు లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

“ప్రియమైన వైఎస్ షర్మిల గారు, అద్భుతమైన క్రిస్మస్ బహుమతుల పంపినందుకు దయచేసి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంగీకరించండి. నారా కుటుంబం మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంది” అని లోకేశ్ పోస్ట్ చేశారు.

చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు

టీడీపీ అధినేత చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని బాధితుల పక్షాన నిలబడి ప్రేమను పంచడం… అందరిని సమదృష్టితో చూడటం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామన్నారు.

లోకేశ్ క్రిస్మస్ శుభాకాంక్షలు

ప్రభువైన ఏసు క్రీస్తు ఆచ‌రించిన‌ ప్రేమ‌, క‌రుణ‌, స‌హ‌నం ప్రతీ ఒక్కరిలో పెంపొందాలని నారా లోకేశ్ అన్నారు. క‌రుణామ‌యుడైన క్రీస్తు మ‌న‌కు అందించిన శాంతి సందేశం స‌మాజానికి పంచి ప్రపంచ‌ శాంతికి దోహ‌ద‌ప‌డాలన్నారు. క్రీస్తు చూపిన మార్గమైన ద‌య, త్యాగ‌గుణం ప్రతీ ఒక్కరూ అల‌వ‌ర్చుకున్నప్పుడే జీవితం సంతోష‌మ‌యం అవుతుందన్నారు. క్రిస్మస్ పర్వదినం సంద‌ర్భంగా క్రైస్తవులంద‌రికీ శుభాకాంక్షలు తెలిపారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *