Mystery Temple: ఇండో పాక్ సరిహద్దు వద్ద మిస్టరీ టెంపుల్.. యుద్ధంలో పాక్ సైన్యం వేలాది బాంబులు వేసినా పేలని వైనం..

 Mystery Temple: ఇండో పాక్ సరిహద్దు వద్ద మిస్టరీ టెంపుల్.. యుద్ధంలో పాక్ సైన్యం వేలాది బాంబులు వేసినా పేలని వైనం..

భారత్-పాకిస్తాన్ సరిహద్దుని రాజస్థాన్‌ కూడా పంచుకుంటుంది. రాష్ట్రంలోని జైసల్మేర్‌లోని దేశ సరిహద్దు ప్రాంతం వద్ద తనోత్ మాతా ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి స్వరూపంగా పూజలను అందుకుంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన ఒక నమ్మకం నేటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇండో-పాక్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం ఈ ఆలయంపై అనేక బాంబులు వేసింది. అయితే ఒక్క బాంబు కూడా ఈ ఆలయంపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. ఆలయ ప్రాంగణంలో కొన్ని బాంబులు పడ్డాయి.. అయితే అవి పేలలేదు.

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఒక మిస్టరీ ఆలయం ఉంది. భారతదేశం-పాకిస్తాన్ యుద్ధాల సమయంలో ఈ ఆలయంపై బాంబులు పడ్డాయి. అయితే అవన్నీ నిష్ఫలమయ్యాయి. యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం ఈ ఆలయంపై దాదాపు 3000 బాంబులను వేసింది. అయితే వాటిలో ఒక్కటి కూడా ఆలయంపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఈ ఆలయంపై పడిన 450 బాంబులు కూడా పేలలేదని చెబుతారు.

ఈ ఆలయం తనోత్ మాత అమ్మవారి ఆలయం. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని భారత-పాకిస్తాన్ సరిహద్దులో ఉంది. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య 1965 , 1971లో జరిగిన రెండు యుద్ధాలలో తనోత్ మాతా ఆలయంపై పాకిస్తాన్ సైన్యం దాడి చేసింది. అయినా ఈ ఆలయానికి ఎటువంటి నష్టం జరగలేదు. ఆలయ ప్రాంగణంలో బాంబులు కూడా పడ్డాయి. కనీసం ఒక్క బాంబు కూడా పేలలేదు. పాకిస్తాన్ ఆర్మీ ఆలయంపై వేసిన బాంబులు ఇప్పటికీ తనోట్ మాతా ఆలయ మ్యూజియంలో ఉన్నాయని చెబుతారు.

3000 బాంబులు వేసిన పాక్ సైన్యం

1965 యుద్ధ సమయంలో పాకిస్తాన్ మూడు వేర్వేరు ప్రదేశాల నుంచి ఆలయంపై దాడి చేసింది. అప్పుడు ఈ అమ్మవారి ఆలయాన్ని రక్షించడానికి మేజర్ జై సింగ్ నేతృత్వంలోని 13 మంది గ్రెనేడియర్లతో కూడిన ఒక బృందం, సరిహద్దు భద్రతా దళానికి చెందిన రెండు బృందాలు పాకిస్తాన్ మొత్తం బ్రిగేడ్‌ను ఎదుర్కొన్నాయి. ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఈ ఆలయంపై 3000 బాంబులను వేసింది. ఆ బాంబులు దీపావళి బాంబులు మాదిరిగా కూడా పేలలేదు ఎటువంటి భావం చూపలేదు.

అప్రమత్తమైన బిఎస్‌ఎఫ్ సైనికులు

1965లో ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే ఉద్దేశ్యంతో పాకిస్తాన్ సైన్యం దాడి చేసింది. పాకిస్తాన్ సైన్యం కూడా మన సరిహద్దులోకి నాలుగు కిలోమీటర్లు లోపలికి ప్రవేశించింది. దీని తరువాత భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ సైన్యంపై దాడి చేసి తీవ్ర నష్టం కలిగించింది. అటువంటి పరిస్థితిలో పాక్ సైన్యం దృష్టి అమ్మవారి ఆలయంపై పడడంతో ఈ ఆలయాన్ని రక్షించే బాధ్యతను BSF తీసుకుంది. నేటికీ, ఆలయ సరిహద్దు వద్ద భద్రతా దళం (BSF) సిబ్బంది బాధ్యత నిర్వహిస్తున్నారు. BSF సిబ్బంది ఆలయాన్ని శుభ్రం చేసి రోజూ అమ్మవారికి హారతి నిర్వహిస్తారు. ఈ ఆలయం భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం తర్వాత చాలా ప్రసిద్ధి చెందింది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *