Mohini Ekadashi: అప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. మోహిని ఏకాదశి రోజున వేటిని దానం చేయాలంటే..

హిందూ మతంలో మోహిని ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం అత్యంత ఫలవంతమైన చర్య అని మత విశ్వాసం. ఈ రోజు మోహిని ఏకాదశి రోజున ఏమి దానం చేయాలి .. దానం చేయడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి తెలుసుకుందాం.
ప్రతి నెలలో రెండు ఏకాదశి తిథిలు ఉంటాయి. ప్రతి ఏకాదశిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. వైశాఖ శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిని మోహినీ ఏకాదశి అంటారు. ప్రతి ఏకాదశి తిధి రోజున శ్రీ మహా విష్ణువుని పూజిస్తారు, ఉపవాసం చేస్తారు. మోహిని ఏకాదశి రోజున ఉపవాసం చేసిన వ్యక్తి అన్ని బంధనాల నుంచి విముక్తి పొందుతాడని నమ్మకం. అంతేకాదు జీవితంలో చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తాడని మత విశ్వాసం ఉంది.
ఈ సంవత్సరం మోహిని ఏకాదశి ఉపవాసం 8 మే 2025న జరుపుకోనున్నారు. ఈ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం ద్వారా పుణ్య ఫలాలు లభిస్తాయి. జీవితంలో ఆనందం , శ్రేయస్సు కలుగుతాయి. అటువంటి పరిస్థితిలో మోహిని ఏకాదశి రోజున ఏమి దానం చేయాలో తెలుసుకుందాం.
మోహిని ఏకాదశి రోజున ఏమి దానం చేయడం శుభప్రదం అంటే
మోహిని ఏకాదశి రోజున ఆహారం, నీరు, బట్టలు, పండ్లు, పుస్తకాలు, షర్బత్ మొదలైనవి దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున పేదలకు వీటిని దానం చేయడం వల్ల ఇంట్లో సిరి సంపదలకు, సుఖ సంతోషాలకు లోటు ఉండదు.
వస్త్ర దానం: మోహిని ఏకాదశి రోజున వస్త్ర దానం చేయడం చాలా శుభప్రదమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఏకాదశి రోజున పేదలకు బట్టలు దానం చేయండి. ఇలా చేయడం వల్ల విష్ణువు ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని.. ఇంట్లో ఆనందం ఉంటుందని నమ్ముతారు.
బెల్లం దానం: మోహిని ఏకాదశి రోజున బెల్లం దానం చేయడం అత్యంత శుభప్రదం. బెల్లం దానం చేయడం వల్ల జీవితంలో అదృష్టం , శ్రేయస్సు వస్తుంది. అలాగే ఏకాదశి రోజున బెల్లం దానం చేయడం వల్ల పేదరికం తొలగిపోతుంది.
అన్నదానం: మోహినీ ఏకాదశి రోజున పేదలకు అన్నదానం చేయాలి. ఆహార వితరణ చేయడం ద్వారా లక్ష్మీదేవి, విష్ణువు ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని, ఇంట్లో సంపద, ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండదని ఒక మత విశ్వాసం ఉంది.
డబ్బుల దానం: మోహిని ఏకాదశి రోజున మీ సామర్థ్యం మేరకు పేదలకు డబ్బులను దానం చేయవచ్చు. ఏకాదశి రోజున డబ్బు దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.