Mercury retrogread: బుధుడు తిరోగమనంతో ఈ రాశులకి గడ్డుకాలమే
బుధుడు తిరోగమన ప్రయాణం మొదలుపెట్టాడు. దీని ఫలితంగా కొన్ని రాశుల వాళ్ళు కష్టాలు ఎదుర్కోబోతున్నారు.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనాన్ని మార్చడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారినప్పుడు దాని ప్రభావం 12 రాశుల మీద పడుతుంది. నవగ్రహాల యువరాజు బుధుడు
డిసెంబర్ 28 నుంచి బుధుడు తన నడకని మార్చుకున్నాడు. బుధుడు మేధస్సు, విద్య, జ్ఞానం, ప్రతిభ మొదలైన వాటికి కారకుడిగా భావిస్తారు. వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన బుధుడు తిరోగమన దిశలో ప్రయాణిస్తున్నాడు. దీని వల్ల కొన్ని రాశులకి అదృష్టం పట్టగా, మరికొన్ని రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బుధుడు స్థానం శుభ ప్రదంగా ఉంటే ఆ వ్యక్తి సుఖసంతోషాలు పొందుతాడు. బుధుడు తిరోగమనం పన్నెండు రాశుల మీద ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
వైవాహిక సంతోషం పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో పెద్దవారి నుంచి ధనం అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి
మనసు కలత చెందుతుంది. స్వీయ నియంత్రణ చాలా అవసరం. కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకోండి. కుటుంబంలో శాంతి నెలకొనడానికి ప్రయత్నించాలి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల నుంచి సహాయం అందుతుంది.
మిథునం
బుధుడు తిరోగమనం వల్ల మిథున రాశి వారికి అశుభ ఫలితాలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకొకపోతే ఇబ్బందులు తప్పవు. వ్యాపారాలకు అంతరాయం కలుగుతుంది. స్నేహితుడి సహాయంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
మకరం
ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. వ్యాపారంలో ఇబ్బందులు వస్తాయి. హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.