Manmohan Singh Death: తండ్రి మాట విని ఉంటే మన్మోహన్ సింగ్ ఆ వృత్తిలో ఉండేవారు.. మాజీ ప్రధాని గురించి ఆసక్తికరమైన వార్త
Manmohan Singh News: ఆర్థిక సంస్కరణల పితామహుడు, పదేళ్లపాటు దేశాన్ని ఏలిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన తుది శ్వాస విడిచారు.
Manmohan Singh Death: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తండ్రి చెప్పిన మాటను అమలు చేసి ఉంటే డాక్టర్ మాత్రమే అయ్యేవారు. తండ్రి సలహా మేరకు మన్మోహన్ సింగ్ ప్రీ-మెడికల్ కోర్సులో అడ్మిషన్ తీసుకున్నారు. కానీ విధి వేరేలా రాసి ఉంది. మెడిసిన్,సైన్స్ చదవాలనే ఆసక్తి లేకపోవడంతో మనసు మార్చుకొని వేరే బాటలో నడిచారు మాజీ ప్రధాని.ఇదే విషయాన్ని డాక్టర్ మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ రాసిన పుస్తకంలో వెల్లడించారు.
దేశం గర్వించే ఆర్థికవేత్త..
మన్మోహన్ సింగ్ ఒకప్పుడు ప్రీ-మెడికల్ కోర్సులో చేరారు. ఎందుకంటే మాజీ ప్రధాని తండ్రి మన్మోహన్ సింగ్‌ను డాక్టర్‌గా చూడాలనుకున్నారు. కానీ కొన్ని నెలల తర్వాత మన్మోహన్ సింగ్‌కు ఆ సబ్జెక్ట్‌పై ఆసక్తి లేకపోవడంతో వైద్య విద్యను విడిచిపెట్టారు. మాజీ ప్రధాని కుమార్తె దమన్ సింగ్ ఆయనపై రాసిన పుస్తకంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
తండ్రి మాట వినని మాజీ ప్రధాని..
భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం కన్నుమూశారు. 92 ఏళ్ల సింగ్ గురువారం సాయంత్రం ‘అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోవడంతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) తరలించారు. తర్వాత తీవ్ర అస్వస్థతతో అత్యవసర విభాగానికి తీసుకువచ్చారు.
మన్మోహన్ ప్రధాని కాకపోతే…
దమన్ సింగ్ 2014లో ప్రచురించిన ‘స్ట్రిక్ట్లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్’ అనే పుస్తకంలో ఆర్థికశాస్త్రం తనను ఆకర్షించిన అంశం అని రాశారు. తన తండ్రికి మంచి హాస్యం ఉందని కూడా రాశారు. ఏప్రిల్ 1948లో మన్మోహన్ సింగ్ అమృత్‌సర్‌లోని ఖల్సా కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు
పుస్తకంలో ఉన్నది ఇదే..
తన పుస్తకంలో దీనిని ప్రస్తావిస్తూ, డామన్ ఇలా వ్రాశారు, “తన తండ్రి డాక్టర్ కావాలని ఆయన తండ్రి కోరుకున్నారు కాబట్టి (మన్మోహన్ సింగ్) రెండేళ్ళ F.Sc. ప్రోగ్రామ్‌లో అడ్మిషన్ తీసుకున్నారని అది అతనికి మరింత వైద్యం చేయడానికి అవకాశం ఇచ్చింది. కొన్ని నెలల తర్వాత, అతను డాక్టర్ కావాలనే ఆసక్తిని కోల్పోయారు.
ప్రముఖుల సంతాపం..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ , ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.దేశ ఆర్థిక పురోగతికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.
రాష్ట్రపతి ఏమన్నారంటే..
భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు గణనీయంగా సహకరించిన వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని “సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ” రాష్ట్రపతి ముర్ము పోస్ట్ చేశారు. సింగ్ దేశానికి చేసిన సేవ, నిష్కళంకమైన రాజకీయ జీవితం , అత్యంత వినయానికి ఎప్పటికీ గుర్తుండిపోతారని ఆమె కొనియాడారు.
ఉప రాష్ట్రపతి నివాళి..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ తెలిపారు.ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చివేశారని “గణనీయమైన మార్పుల కాలంలో మన్మోహన్ సింగ్ మన దేశాన్ని ధైర్యంగా నడిపించారని కొనియాడారు. అభివృద్ధి , శ్రేయస్సు కొత్త మార్గాలను తెరిచారు” అని ధన్‌ఖర్‌ను ఉటంకిస్తూ ఉపరాష్ట్రపతి సెక్రటేరియట్ పేర్కొంది.