Liquor Shops in Telangana : కొలువు దీరిన కొత్త మద్యం దుకాణాలు.. గ్రేటర్ లో 615 షాపులకు అనుమతులు

 Liquor Shops in Telangana : కొలువు దీరిన కొత్త మద్యం దుకాణాలు.. గ్రేటర్ లో 615 షాపులకు అనుమతులు

Liquor Shops in Telangana : తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలు కొలువు దీరాయి. ఇటీవలే టెండర్ల ప్రక్రియ ముగియగా… గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల పరిధిలో కొత్తగా 615 మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి.

Liquor Shops in Telangana : గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాలో కొత్తగా 615 మద్యం దుకాణాలకు అబ్కారీ శాఖ అనుమతులు ఇచ్చింది. శుక్రవారం అనుమతులు దక్కిన నూతన మద్యం దుకాణాలు ప్రారంభం అయ్యాయి.కాగా గత ఆగస్ట్ నెలలో ఎక్సైజ్ శాఖ 615 వైన్స్ షాపులకు నోటిఫికేషన్ జారీ చేసింది.ఎన్నికల దృష్ట్యా ముందస్తుగానే నోటిఫికేషన్ వెలువడటంతో వ్యాపారుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది.

100 షాపులకు 9వేల మంది టెండర్లు…

గ్రేటర్ లో అనేక చోట్ల పెద్ద ఎత్తున పోటీకి దిగారు. ఒక్కో మద్యం దుకాణానికి ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున ఫీజ్ విధించింది.ఒక వ్యాపారి ఎన్ని దుకాణాల కైనా టెండర్ వేసుకోవచ్చని ప్రభుత్వం తెలపడంతో ఒక్కో వ్యాపారి నుంచి ప్రభుత్వానికి భారీ సంఖ్యలో దరఖాస్తులు అందాయి.శంషాబాద్ ఎక్సిజ్ జిల్లా పరిధిలో కేవలం 100 వైన్స్ షాపులకు ఏకంగా 9 వేల మంది పోటీ పడ్డారు.ఇటు సరుర్ నగర్ లో 135 వైన్స్ షాపులకు గాను 9వేల మంది టెండర్లు వేశారు.

ప్రభుత్వానికి రూ.650 కోట్ల ఆదాయం…

హైదరాబాద్,రంగారెడ్డి మరియు మేడ్చల్ జిల్లాలో 615 దుకాణాల పై లైసెన్స్ ఫీజ్ రూపంలో ప్రభుత్వానికి రూ.650 కోట్ల ఆదాయం లభించిందని అంచనా.అయితే నగరంలోని వైన్స్ షాపుల కంటే నగర శివారులో ఉన్న వైన్స్ షాపుల కోసమే వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీ పడినట్లు తెలుస్తుంది ఉప్పల్,మేడిపల్లి,శేరిలింగంపల్లి,కుషాయిగూడ,కీసర,శంషాబాద్ మరియు తదితర ప్రాంతాల్లోని మద్యం దుకాణాలు భారీ డిమాండ్ కనిపించింది.ఆగస్ట్ 16న నోటిఫికేషన్ విడుదల చేసి అదే నెల చివరిలో డ్రాలు తీశారు.

సాధారణంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మద్యం దుకాణాలకు ప్రభుత్వం లైసెన్సులను అందచేస్తుంది.ఒకసారి లైసెన్స్ పొందిన వ్యాపారి రెండేళ్ల పాటు షాప్ ను నిర్వహించుకోవచ్చు.రెండేళ్లకోసారి అక్టోబర్ నెల చివరిలో నోటిఫికేషన్ విడుదల చేసి నవంబర్ లో అనుమతులు అందిస్తారు. ఇక అదే నెలలో మొత్తం ఫీజ్ లో నాలుగో వంతు చెల్లించిన వారికి డిసెంబర్ ఒకటిన దుకాణాలకు లిక్కర్ చేరుతుంది.

శుక్రవారం నుంచి కొత్త షాపులు షురూ….

అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆగస్ట్ నెలలోనే ఈ ప్రక్రియ చేపట్టారు అధికారులు.కాగా నూతన మద్యం దుకాణాలకు డ్రా ద్వారా అనుమతి దక్కిన వారు సెప్టెంబర్ లోనే ప్రభుత్వానికి నాలుగో వంతు తమ ఫీజ్ చెల్లించినప్పటికీ…. ఎన్నికలు లిక్కర్ సేల్స్ కు అంతరాయం కలిగించింది.మరోవైపు నవంబర్ 30 నాటికే మద్యం చేరాల్సి ఉండగా ఎన్నికల దృష్ట్యా శుక్రవారం ఉదయం నుంచే మద్యం సరఫరా కావడంతో కొన్ని చోట్ల సాయంత్రం వరకు కొత్త దుకాణాలు తెరుచుకున్నాయి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *