Life Style: హాట్ or కోల్డ్.. వేసవిలో ఏ పాలు తాగితే మంచిది..?

 Life Style: హాట్ or కోల్డ్.. వేసవిలో ఏ పాలు తాగితే మంచిది..?

వేసవిలో పాలను వేడిగా తాగడం కంటే చల్లగా తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. చల్లని పాలు బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి తోడ్పడతాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Life Style: పాలలో పుష్కలమైన పోషకాలు ఉండడంతో.. దీనిని సంపూర్ణ ఆరోగ్యంగా పరిగణిస్తారు. ఇందులో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్  ఉంటాయి. పాలలోని క్యాల్షియం ఎముకలను బలంగా తయారు చేయడంలో తోడ్పడుతుంది. పాలను తాగడం ఆరోగ్యానికి ప్రయోజనకరమని అందరికీ తెలుసు.. కానీ ఏవిధంగా తాగితే మంచిది? అనేది చాలా మందికి తెలియదు. ముఖ్యంగా వేసవిలో పాలను వేడిగా తాగడం కంటే చల్లగా తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

శరీరాన్ని హైడ్రేటెడ్ 

వేసవిలో అధిక చెమట కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఇటువంటి పరిస్థితిలో చల్లని పాలలో ని పొటాషియం,  సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు డీహైడ్రేషన్ సమస్యను నివారించడంలో సహాయపడతాయి.

చర్మానికి మేలు 

చల్లని పాలు తాగడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఇది వేడి వల్ల కలిగే దద్దుర్లు,  పొడిబారడం వంటి చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే పాలలోని లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

బరువు తగ్గడం

పాలలో ఉండే లాక్టోస్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఇది వేసవిలో అలసట, బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాదు, చల్లని పాలు తాగడం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

పోషక నిల్వలు 

పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి,  విటమిన్ బి12 వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వేడి చేయడం ద్వారా ఇవి ఈ పోషక విలువలు తగ్గే అవకాశం ఉంటుంది. కావున చల్లని పాలను తాగడం వల్ల ఎముకలను బలపరచడంతో పాటు కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

జీర్ణక్రియను 

వేసవిలో చల్లని పాలు తీసుకోవడం వల్ల కడుపు చల్లబడి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనివల్ల అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు తక్కువగా తలెత్తుతాయి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *