Kota Srinivasa Rao: కోటపై ఎన్టీఆర్ అభిమానులు దాడి.. విజయవాడ రైల్వేస్టేషన్‌లో!

 Kota Srinivasa Rao: కోటపై ఎన్టీఆర్ అభిమానులు దాడి.. విజయవాడ రైల్వేస్టేషన్‌లో!

కోట శ్రీనివాసరావు  కెరీర్‌లో ఒక వివాదాస్పద చిత్రం మండలాధీశుడు. ఈ చిత్రంలో ఆయన నటించిన ఒక పాత్ర అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావుగారిని వ్యంగ్యంగా అనుకరించేలా ఉంటుందని భావించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు.  గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.  750కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన కోట సీనీ జీవితంలో కూడా ఛేదు అనుభవాలున్నాయి.

ఎన్.టి. రామారావుగారిని వ్యంగ్యంగా

కోట శ్రీనివాసరావు  కెరీర్‌లో ఒక వివాదాస్పద చిత్రం మండలాధీశుడు. ఈ చిత్రంలో ఆయన నటించిన ఒక పాత్ర అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావుగారిని వ్యంగ్యంగా అనుకరించేలా ఉంటుందని భావించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఈ సినిమా కారణంగా కోట శ్రీనివాసరావు  వ్యక్తిగతంగా కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. ఒకసారి విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఎన్టీఆర్ అభిమానులు ఆయన్ను చూసి, గుర్తుపట్టి “కోటా గాడు వచ్చాడురా” అంటూ దాడి చేసి, తీవ్రంగా కొట్టారని ఆయన స్వయంగా వెల్లడించారు. ఎన్టీఆర్ విజయవాడలో ఒక కార్యక్రమానికి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగిందని, ఆ అభిమానులు ఆవేశంలో తనపై దాడి చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు.  అయితే, ‘మండలాధీశుడు’ సినిమాలో ఎన్టీఆర్ గారిని కించపరచాలనే ఉద్దేశ్యం లేదని, కేవలం ఆయన ప్రవర్తనను మాత్రమే సినిమాలో చూపించామని కోట శ్రీనివాసరావుగారు వివరించారు. ఎన్టీఆర్ అభిమానులు దానిని జీర్ణించుకోలేక ఆవేశంలో దాడి చేసి ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ను కలిశానని ఆయన తన నటనను మ మొచ్చుకున్నారని.. వెంటనే ఆయన కాళ్లకు దండం పెట్టానని కోట తెలిపారు.

కోట శ్రీనివాసరావు తన నటనా ప్రస్థానంలో ఎంతో మంది గొప్ప నటులతో కలిసి పనిచేశారు. కానీ, నందమూరి తారక రామారావుతో కలిసి నటించే అవకాశం రాలేదని, అది తనకు తీరని కోరికగా మిగిలిపోయిందని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. ‘మేజర్ చంద్రకాంత్’ వంటి కొన్ని సినిమాలలో అవకాశం వచ్చినా, అది సాధ్యపడలేదని తెలిపారు. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంతో అవకాశం లేకుండా పోయిందని అన్నారు. ఎన్టీఆర్ తో కోట శ్రీనివాసరావుకి ప్రత్యక్ష విభేదాలు లేకపోయినా, ‘మండలాధీశుడు’ సినిమా వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. కానీ వ్యక్తిగతంగా ఎన్టీఆర్ పై ఆయనకు ఎప్పుడూ గౌరవం ఉంది.

అయితే  కోట శ్రీనివాసరావు జూనియర్ ఎన్టీఆర్ నటనను తరచుగా ప్రశంసిస్తూ ఉంటారు. ప్రస్తుత తరం నటుల్లో ఎన్టీఆర్ కున్న పొటెన్షియాలిటీ, డైలాగ్ డెలివరీ, డ్యాన్సులు అద్భుతమని, అన్ని రసాలను పండించగల దిట్ట అని ఆయన అనేక సందర్భాలలో కొనియాడారు.

మండలాధీశుడు ప్రభాకరరెడ్డి దర్శకత్వంలో కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలో నటించిన 1987 నాటి రాజకీయ నేపథ్యమున్న తెలుగు చలన చిత్రం. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లో ఆయన వ్యవహారశైలి మీద, ప్రభుత్వం మీద వ్యంగ్యంగా విమర్శించే కథాంశంతో తెరకెక్కిందన్న ఆరోపణలున్నాయి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *