Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

సంస్థలో ఆశించిన మేర పని చేయని ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.శునకాల మాదిరిగా మోకాళ్ల పై నడవాలని,నేల పై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించిందట.
సంస్థలో ఆశించిన మేర పని చేయని ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.శునకాల మాదిరిగా మోకాళ్ల పై నడవాలని,నేల పై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించిందట. దీనికి సంబంధించిన వీడియోలు స్థానిక మీడియాలో ప్రసారం కావడంతో స్పందించిన కార్మిక శాఖ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది.
ఓ సంస్థలో పని చేస్తున్న వ్యక్తి మెడకు బెల్టు కట్టి ఉండగా…అతడిని మరో వ్యక్తి మోకాళ్ల పై కుక్కలా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. మరికొందరు నాలుకతో నాణేలు తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ విషయమై కొందరు ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ…నిర్దేశించిన టార్గెట్ ను పూర్తి చేయని ఉద్యోగుల పై తమ సంస్థ ఈ విధమైన వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఈ అమానవీయ ఘటన పై కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దృశ్యాలు షాక్ కు గురి చేశాయని ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శివన్ కుట్టి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ఆయన వెల్లడించారు. ఈ ఘటన పైపూర్తి స్థాయి నివేదికను అందించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు