KCR Surgery : కేసీఆర్ ఎముక మార్పిడి శస్త్ర చికిత్స పూర్తి… తాజా హెల్త్ బులెటిన్ విడుదల

 KCR Surgery : కేసీఆర్ ఎముక మార్పిడి శస్త్ర చికిత్స పూర్తి… తాజా హెల్త్ బులెటిన్ విడుదల

KCR Hip Replacement Surgery : యశోద డాక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స పూర్తి అయింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు.

కేసీఆర్ గారి తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం

KCR Hip Replacement Surgery : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు యశోదా డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కేసీఆర్ కు నిర్వహించిన సర్జరీ విజయవంతం అయినట్లు వెల్లడించారు. ఈ శస్త్రచికిత్సకు ఆయన శరీరం బాగానే సహకరించిందని వారు తెలిపారు. సర్జరీ విజయవంతం కావడంతో కేసీఆర్ ను ఆపరేషన్ థియేటర్ నుంచి సాధారణ రూమ్ కు మార్చారు. కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి మరో 6 నుంచి 8 వారాలు పడుతుందని డాక్టర్లు ప్రకటించారు.

ఏం జరిగిందంటే…?

KCR ‌In Hospital: బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రమాదానికి గురయ్యారు. ఇంట్లో కాలు జారి పడటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక పరీక్షల్లో కేసీఆర్‌కు తుంటి ఎముక విరిగినట్టు గుర్తించారు. దీంతో కేసీఆర్‌కు శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది.

కేసీఆర్ ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ… ప్రధాని మోదీతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు మంత్రులు, ముఖ్య నేతలు స్పందించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *