Kazakhstan: కజకిస్తాన్‌ విమాన ప్రమాదంలో 38కి చేరిన మృతుల సంఖ్య

 Kazakhstan: కజకిస్తాన్‌ విమాన ప్రమాదంలో 38కి చేరిన మృతుల సంఖ్య

కజికిస్తాన్‌లోని అక్టౌ నగరంలో విమానం కుప్పకూలిన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. 109 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇందులో  మృతుల సంఖ్య 38కి చేరింది.

కజకిస్తాన్ విమాన ప్రయాణంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం మరణించిన వారి సంఖ్య 38కి చేరింది.  కజకిస్థాన్‌ లో ఘోర ప్రమాదం జరిగింది. అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ప్రయాణికుల విమానం అక్టౌ సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ విమానంలో మొత్తం 67 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో కలిపి మొత్తం 72 మంది ఉన్నారు.

మంచు కారణమా? పక్షి ఢీకొందా?

అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి రష్యా రిపబ్లిక్‌ చెచెన్యా రాజధాని గ్రోజ్నీకి విమానం బయలుదేరింది. గ్రోజ్నీలోని దట్టమైన మంచు కారణంగా ఫ్లైట్‌ను దానిని దారి మళ్లించారు. ఈ క్రమంలోనే అక్టౌ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తూ ఉండగా ప్రమాదవశాత్తూ కూలిపోయింది. కూలిన వెంటనే విమానం నుంచి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదానికి ముందు ఎయిర్‌పోర్ట్‌పైన విమానం పలుమార్లు గిరగిరా తిరిగి, నేల కూలిందని స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. మరోవైపు ఈ ఫ్లైట్ కూలడానికి ప్షి ఢీకొనడమే కారణమని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విమానంలోని కీలకమైన కంట్రోల్స్‌, బ్యాకప్‌ సిస్టమ్స్‌ విఫలమైనట్లు గుర్తించి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఇంటర్‌ఫాక్స్‌ న్యూస్‌ ఏజెన్సీ చెప్పింది. పక్షి గుద్దిన తర్వాతనే పైలట్లు అత్యవసర లాండింగ్‌కు ప్రయత్నించారని రాయటర్స్ చె

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *