Karthik Dandu: పెళ్లి పీటలు ఎక్కబోతున్న విరూపాక్ష డైరెక్టర్.. ఘనంగా ఎంగేజ్మెంట్ ! ఫొటోలు వైరల్
‘విరూపాక్ష’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా కార్తీక్.. హర్షిత అనే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్తీక్ ప్రస్తుతం నాగచైతన్యతో ఓ మూవీ చేస్తున్నాడు.
డైరెక్టర్ కార్తీక్ దండు (Director Karthik Dandu) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తాజాగా తన ప్రేయసి హర్షితను నిశ్చితార్థం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ (Engagement) వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీరి పెళ్లి ముహూర్తానికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి
కార్తీక్ దండు సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నారు. దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగా వ్యవహరించారు. అయితే సుకుమార్ నుంచి శిష్యరికం పొందిన యంగ్ డైరెక్టర్లలో కార్తీక్ కూడా ఒకరు. ప్రస్తుతం కార్తీక్ అక్కినేని హీరో నాగ చైతన్యతో ఓ అడ్వెంచర్ డ్రామా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అనౌన్సమెంట్ ఇంకా చేయనప్పటికీ.. అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. ఇందులో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరీ కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తుంది.