Kadapa: వామ్మో ఇదేందిరా సామి ఇంతుంది.. అందరూ ఆశ్చర్యపోతున్న వైనం..

కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం గూడూరు గ్రామంలో ఓ రైతు పొలంలో అరుదైన జంబో పుట్టగొడుగు బయటపడింది. ఈ పుట్టగొడుగు ఏకంగా 1.3 కేజీల బరువు తూగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణ పుట్టగొడుగులకు భిన్నంగా, ఇది భారీ ఆకారంలో ఉంది.
వెజిటేబుల్ ప్రియులకు నాన్ వెజ్ రుచిని ఇచ్చే వెజిటేబుల్ వంటకాలలో అందరికీ ముందుగా గుర్తొచ్చేది పుట్టగొడుగులు.. నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్, ఫిష్ ఎంత ఇష్టంగా తింటారో వెజిటేబుల్ ప్రియులు పుట్టగొడుగులను అంతకంటే అమితంగా తింటారు… వెజ్ ప్రియులే కాదు నాన్ వెజ్ ప్రియులకు కూడా పుట్టగొడుగులు అంటే ఎంతో ఇష్టం.. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే పుట్టగొడుగు గురించి వింటే అందరూ ఔరా అనాల్సిందే.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం గూడూరు గ్రామంలో ఓ రైతు పొలంలో అరుదైన పుట్టగొడుగు కనిపించింది. అది ఏకంగా ఒక కేజీ 300 గ్రాముల బరువు తూగింది. సాధారణంగా పుట్టగొడుగులు చిన్నగా మన చేతి వేళ్ళ పొడుగులో పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే గంగాధర్ అనే రైతు పొలంలో పుట్టిన ఈ పుట్టగొడుగు జంబో పుట్టగొడుగు మాదిరిగా అందరినీ ఆకర్షిస్తోంది. “అల్లం పుట్టగొడుగు”గా ప్రసిద్ధి చెందిన ఈ అరుదైన పుట్టగొడుగును చూడటానికి గ్రామస్థులు ఆసక్తి చూపిస్తున్నారు. భారీ ఆకారంలో పెద్దగా ఉంది ఈ పుట్టగొడుగు. తూకం వేసి చూస్తే కేజీ 300 గ్రాముల బరువు తూగింది. సాధారణంగా ఇదే తూకంలో పుట్టగొడుగులు కొంటే ఒక పెద్ద క్యారీ బ్యాగ్ నిండా వస్తాయి. అలాంటిది ఒకటే పుట్టగొడుగు అంత బరువు తూగడం అనేది మామూలు విషయం కాదు. ఈ అరుదైన పుట్టగొడుగు చూడడానికి చక్కగా ఉంది ఇంకా దీనిని కూర వండితే ఇంకా ఎంత రుచిగా ఉండిద్దో మీరే ఆలోచించండి.