Jagga Reddy: నువ్వు దేవుడు సామీ.. లైవ్ లో 3 లక్షలు సాయం చేసిన జగ్గారెడ్డి.. వీడియో వైరల్!
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి మంచి మనస్సు చాటారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతికి రూ.3 లక్షల సాయం చేశారు. ఇంకా హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తానని హామీ ఇచ్చారు.
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్టైలే వేరు. ఆయన ఏం మాట్లాడినా.. ఏం చేసినా ప్రత్యేకమే. పాలిటిక్స్ పై మాత్రమే కాకుండా.. గత కొన్నేళ్లుగా ఆయన సేవా కార్యక్రమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా క్యాన్సర్ బాధితులకు లక్షల కొద్దీ సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో 9 ఏళ్ల నుంచి బాధ పడుతున్న ఓ బాలికకు ఆయన సహాయం చేశారు. 3 లక్షల రూపాయలు అందించారు. హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తానని హామీ ఇచ్చారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన సుష్మ 9 ఏళ్ల క్రితం దసరా పండుగకు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లింది. అయితే.. అక్కడ పొరపాటున చీమల మందు కలిపిన చపాతిని తిని అనారోగ్యానికి గురైంది. అప్పటి నుంచి ఆమె కోలుకోలేదు. 9 ఏళ్లుగా మంచానికే పరిమితమైంది. ఆర్థిక స్థోమత లేకపోవడంతో మంచి వైద్యం అందించలేకపోయామని తండ్రి చెవుగాని మహేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తమ ధీన స్థితిని వీరు గాంధీ భవన్ మీడియాకు చెప్పారు. దీంతో మీడియా ప్రతినిధులు జగ్గారెడ్డికి విషయం చెప్పారు. వెంటనే జగ్గారెడ్డి ఆ యువతి తండ్రి మహేష్ ను పిలిపించి మాట్లాడారు. వైద్యులతో స్వయంగా మాట్లాడారు.