Jagananna Asara: అనంతపురంలో నేడు ఆసరా నిధులు విడుదల చేయనున్న సిఎం జగన్

 Jagananna Asara: అనంతపురంలో నేడు ఆసరా నిధులు విడుదల చేయనున్న సిఎం జగన్

Jagananna Asara: ఏపీలో నాలుగో విడత ‘వైఎస్సార్‌ ఆసరా’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో ప్రారంభించనున్నారు

నేడు ఆసరా పథకంనిధులు విడుదల

నేడు ఆసరా పథకంనిధులు విడుదల
Jagananna Asara: ముఖ్యమంత్రి జగన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలు వీక్షించేలా అన్ని రైతుభరోసా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ బ్యాంకర్ల సంఘం (ఎస్‌ఎల్‌బీసీ) గణాంకాల ప్రకారం.. గత అసెంబ్లీ ఎన్నికల పొలింగ్‌ జరిగిన 2019 ఏప్రిల్‌ 11వ తేదీ నాటికి రాష్ట్రంలో 78,94,169 మంది డ్వాక్రా మహిళల పేరిట రూ.25,570.80 కోట్లు పొదుపు సంఘాల రుణాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,175.97 కోట్లను ఆయా మహిళల ఖాతాల్లో జమచేశారు. ఇక మంగళవారం నుంచి నాలుగో విడతగా మిగిలిన రూ.6,394.83 కోట్లను కూడా నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తారు. దీంతో నాలుగు విడతల్లో 2019 ఎన్నికల నాటికి SLBC తుది జాబితా ప్రకారం ఉన్నరూ. 25,571 కోట్ల రుణాన్నితీరుస్తామన్న హామీ నెరవేరుతుందని చెబుతున్నారు.

నేడు అందిస్తున్న వైఎస్సార్ ఆసరా లబ్దితో ఈ 56 నెలల కాలంలో నేరుగా DBT (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా అందించిన లబ్ధి రూ.2.50 లక్షల కోట్లు దాటనుంది,. వివిధ పథకాల ద్వారా కేవలం మహిళలకు మాత్రమే గత 56 నెలల్లో జగన్ ప్రభుత్వం .రూ. 2,66,772.55 కోట్లను నేరుగా వారి ఖాతాలకు బదిలీ చేసింది.

వైఎస్సార్ ఆసరా మైలు రాళ్లు

మొదటి విడత, 11 సెప్టెంబర్ 2020

అందించిన లబ్ధి రూ.6,318.76 కోట్లు లబ్ధిదారుల సంఖ్య 77,87,295

రెండవ విడత, 07 అక్టోబర్ 2021

అందించిన లబ్ధి రూ.6,439.52 కోట్లు లబ్ధిదారుల సంఖ్య 78,75,539

మూడవ విడత, 25 మార్చి 2023

అందించిన లబ్ధి రూ.6,417.69 కోట్లు లబ్ధిదారుల సంఖ్య 78,94,169

నాల్గవ విడత, 23 జనవరి 2024

అందించిన లబ్ధి రూ.6,394.83 కోట్లు లబ్ధిదారుల సంఖ్య 78,94,169

వైఎస్సార్ ఆసరా ద్వారా 4 విడతల్లో అందించిన మొత్తం లబ్ధి రూ. 25,571 కోట్లు డ్వాక్రా మహిళలకు అందించినట్టు చెబుతున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *