IRCTC Nepal Tour : బడ్జెట్ ధరలో నేపాల్ టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలివే

 IRCTC Nepal Tour : బడ్జెట్ ధరలో నేపాల్ టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలివే

IRCTC Nepal Tour Package Details : నేపాల్ చూడాలని చాలా మందికి ఆశ ఉంటుంది. వెళ్తే ఖర్చు ఎంత అవుతుందోనని భయం. అలాంటివారి కోసం ఐర్‌సీటీసీ బడ్జెట్‌ ధరలో టూర్ ప్యాకేజీ ప్రకటించింది.

కొత్త సంవత్సరంలో కొన్ని ప్రేదేశాలను చూసేందుకు ప్లాన్ చేయండి. కుటుంబంతో కలిసి వెళ్లి రండి. జనవరిలో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేస్తే IRCTC టూర్ ప్యాకేజీలు మీకోసం ఉన్నాయి. వేరే దేశానికి వెళ్లి రావాలనే కోరికను తీర్చుకోవచ్చు. IRCTC మీకు అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందించింది. ఇందులో మీరు నేపాల్ లోని ఖాట్మండు, పోఖారాలను సందర్శించే అవకాశం లభిస్తుంది.

నేపాల్‌లో చూసేందుకు చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఎత్తైన మంచుకొండలు అద్భుతంగా ఉంటాయి. హిమాలయాల కనువిందు చేస్తాయి. హిందూ పవిత్ర స్థలాలు, అందమైన దేవాలయాలు, స్థూపాలు, అనేక యునెస్కో వారసత్వ ప్రదేశాలను చూడవచ్చు. అది కూడా బడ్జెట్ ధరలోనే వెళ్లి రావొచ్చు.

మిస్టికల్ నేపాల్ పేరుతో ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ముంబయి, బెంగళూరు నుంచి ఈ టూర్ అందుబాటులో ఉంది. ఇందులో మీరు ఖాట్మండు, పోఖారాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. విమానంలో ప్రయాణించొచ్చు. ముంబయి నుంచి ప్రయాణం మొదలవుతుంది. 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ఇది జనవరి 9 నుంచి ప్రారంభం కానుంది. ఖాట్మండు, పోఖారాలో బస చేసే అవకాశం ఉంటుంది. భోజనం కూడా పెడతారు.

ఈ విమానం జనవరి 9న ఉదయం 11.15 నిమిషాలకు ముంబయి నుంచి బయలుదేరుతుంది. మీరు ఒక్కరే ఈ ప్యాకేజీని బుక్ చేసుకుంటే.. రూ.52,300గా ఉంది. అదే డబుల్ అయితే రూ. 44,800, ట్రిపుల్ అయితే రూ. 44,100 ధరగా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల వయసు పిల్లలకు రూ.42,600గా ఉంది.

నేపాల్‌లో అందమైన ప్రదేశాలు చూసి రావొచ్చు. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీని తీసుకుంటే చాలు. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసి రావాలనుకునేవారికి ఈ ప్యాకేజీ బాగుంటుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడండి.

5 రాత్రులు, 6 రోజులు ప్యాకేజీ ఇది. ఈ టూర్ వెళ్లాలని అనుకునేవారికి తప్పకుండా పాస్‌పోర్ట్ లేదా ఓటర్ ఐడీ మాత్రం ఉండాలి. ప్యాకేజీలోనే ఫ్లైట్ టికెట్స్, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెలింగ్ ఉంటాయి. ఈ ప్యాకేజీ బుక్ చేసుకునేవారు నేపాల్ జారీ చేసిన గైడ్‌లైన్స్, ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *