India Post Payments Bank: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ జాబ్స్‌.. నెలకు రూ. 3.70 లక్షలు వరకూ జీతం

 India Post Payments Bank: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ జాబ్స్‌.. నెలకు రూ. 3.70 లక్షలు వరకూ జీతం

IPPB Jobs : ఐఐపీబీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో 2024 జనవరి 4వ తేదీ వరకు అప్లయ్‌ చేసుకునే అవకాశం కల్పించింది.

ప్రధానాంశాలు:

  • ఐపీపీబీ రిక్రూట్‌మెంట్‌ 2023
  • జేఎం, సీఎఫ్‌ఓ పోస్టుల భర్తీకి ప్రకటన
  • జనవరి 4 దరఖాస్తులకు చివరితేది
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్
IPPB Recruitment 2023 : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (India Post Payments Bank) ఖాళీగా ఉన్న జనరల్ మేనేజర్/ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి జనవరి 4, 2024 చివరి తేదీ.

ముఖ్య సమాచారం :

  • అర్హతలు : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి CA, MBA, CFA పూర్తి చేసి ఉండాలి.
  • వయో పరిమితి : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థుల వయస్సు నవంబర్ 1, 2023 నాటికి 38 సంవత్సరాల కంటే తక్కువ, 55 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
  • జీతం : నెలకు రూ. 3,27,000- రూ. 3,70,000 ఉంటుంది.
  • జాబ్‌ లొకేషన్‌ : న్యూఢిల్లీ
  • దరఖాస్తు ఫీజు : SC/ST/PWD అభ్యర్థులు: రూ.150.. మిగతా అభ్యర్థులందరూ: రూ.750 చెల్లించాలి.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవాలి.
  • ఎంపిక ప్రక్రియ : ఆన్‌లైన్ పరీక్ష ద్వారా, అసెస్ మెంట్, గ్రూప్ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తులు ప్రారంభతేదీ: డిసెంబర్‌ 15, 2023
  • దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: జనవరి 4, 2024
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *