Hyderabad Grand Bhatukamma: పూలవనమైన ట్యాంక్‌బండ్‌..అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

 Hyderabad Grand Bhatukamma: పూలవనమైన ట్యాంక్‌బండ్‌..అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

గడచిన పదిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుగుతున్న బతుకమ్మ సంబురాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ బతుకమ్మ వేడుకల్లో చివరి రోజైన నేడు సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌ మీద ఘనంగా నిర్వహిస్తోంది.

Hyderabad Grand Bhatukamma:

 

 Hyderabad Grand Bhatukamma:  గడచిన పదిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తు్న్న బతుకమ్మ సంబురాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ బతుకమ్మ వేడుకల్లో చివరి రోజైన నేడు సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌ మీద ఘనంగా నిర్వహిస్తోంది. సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మగా పిలిచే ఈ బతుకమ్మలను పెద్ద పళ్ళెంలో గుమ్మడి ఆకులు, రంగులు అద్దిన గునుగు పూలు, తంగేడు, ఇతర రంగురంగుల పూలతో పేర్చిన మహిళలు వాటిని తలలపై పెట్టుకుని ట్యాంక్‌బండ్‌కు పయనమయ్యారు.

బతుకమ్మ వేడుకల కోసం భాగ్యనగరం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. అందులో భాగంగా ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. మహిళలు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను అందంగా అలంకరించి ట్యాంక్‌బండ్‌ కు చేరుకున్నారు. బతుకమ్మ చుట్టూ.. చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. వందలాది మంది మహిళలు అక్కడకు చేరుకుని బతుకమ్మ సంబురాల్లో పాలుపంచుకుంటున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో 500 మంది కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్నారు. అమర జ్యోతి స్థూపం నుంచి ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వరకు 700 బతుకమ్మలతో ర్యాలీ గా బయలు దేరిన మహిళలు ట్యాంక్‌బండ్‌ మీద బతుకమ్మలను ఉంచి ఆడుతున్నారు.

ఈ వేడుకల కోసం ట్యాంక్ బండ్ ను ప్రభుత్వం అంత్యంత సుందరంగా ముస్తాబు చేసింది. సద్దుల బతుకమ్మ కోసం అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వేలాది మహిళలు అక్కడకు చేరుకుని బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకొంటున్నారు. ఈ వేడుకలకు ప‌ర్యాట‌క, సాంస్కృతిక‌ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేష‌న్ చైర్మన్లు హాజరయ్యారు.ట్యాంక్ బండ్‌పై గ్రాండ్ ప్లోర‌ల్ ప‌రేడ్ నిర్వహించడంతో పాటు, హుస్సేన్ సాగ‌ర్‌లో తేలియాడే బ‌తుక‌మ్మలు, సెక్రటేరియ‌ట్ పై 3డీ మ్యాప్ లేజ‌ర్ షోను నిర్వహించారు. ట్యాంక్​బండ్​ తీరాన మెట్రో పాలిటన్  డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్ ఎండీ ఏ) ఆధ్వర్యంలో కార్నివాల్​ పేరుతో నిర్వహించిన ఉత్సవాలు కనువిందు చేశాయి.

ట్యాంక్​బండ్​ పరిసరాలను వివిధ రకాల బతుకమ్మ డిజైన్​లతో అందంగా ముస్తాబు చేశారు. సంప్రదాయ నృత్యాలు, జానపదాలు, నాటికలు ఆకట్టుకున్నాయి. హుస్సేన్ సాగర్‌లో రంగురంగుల కాంతులతో తేలియాడిన బతుకమ్మ స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచింది. వివిధ రకాల తెలంగాణ వంటకాలతో ఫుడ్​ స్టాళ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు నగర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో బతుకమ్మ జోష్​ కొనసాగింది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *