Hyderabad Cricket Association: వారికి ఉచితంగానే ఐపీఎల్ టికెట్లు.. ఇలా అప్లై చేసుకోండి…

మండుతున్న ఎండల వేళ ఇండియన్ ప్రీమియర్ లీగ్… క్రికెట్ లవర్స్‌కు మంచి కిక్ ఇస్తోన్న విషయం తెలిసిందే. సాయంకాలం వేళ మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియాలకు అభిమానులు పోటెత్తుతున్నారు. ఇక ఈ సీజన్‌లో పరుగుల వరద పారుతుంది. అన్ని టీమ్స్ చెలరేగిపోతున్నాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ దుమ్మురేపుతోంది.
మొన్న సండే మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. రాజస్థాన్ రాయల్స్‌పై 286 పరుగు చేసి.. ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. మొదటి అత్యధిక స్కోర్ రికార్డు కూడా సన్ రైజర్స్ పేరు మీదనే ఉండటం విశేషం. ఇక గత సీజన్‌లో సంచలన ప్రదర్శనతో తృటిలో టైటిట్ మిస్ చేసుకున్న హైదరాబాద్… ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాలన్న పంతంతో ఈ సీజన్‌లో చెలరేగిపోతుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీతో హైదరాబాద్ టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది.
మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ స్టేడియంలో చూడాలనుకునే దివ్యాంగులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచులకు దివ్యాంగులకు ఉచితంగా కాంప్లిమెంటరీ పాస్‌లను అందించనున్నట్లు ప్రకటించింది. మ్యాచులు చూడాలనుకునేవారు.. పేరు, ఫోన్ నెంబర్, వ్యాలిడ్ డిజబులిటీ ప్రూఫ్, ఏ మ్యాచ్ కోసం పాస్ కోవాలి వంటి వివరాలను pcipl18rgics@gmail.com ఈ మెయిల్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఈ సీట్లు కూడా పరిమితంగానే ఉన్నాయి.