Hyderabad: మన్మోహన్‌సింగ్‌ మద్దతు లేకుంటే హైదరాబాద్‌ మెట్రో లేదు.

 Hyderabad: మన్మోహన్‌సింగ్‌ మద్దతు లేకుంటే హైదరాబాద్‌ మెట్రో లేదు.

హైదరాబాద్‌ మెట్రోపై ఎన్నో విమర్శలు వచ్చినా.. పీపీపీ విధానమే సరైనదని, ఈ పద్ధతిని కొనసాగిస్తూ అంతర్జాతీయ టెండర్లకు వెళ్లండని అప్పట్లో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌(Manmohan Singh) ప్రోత్సహిస్తూ తమకు మద్దతుగా నిలిచారని హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మెట్రోపై ఎన్నో విమర్శలు వచ్చినా.. పీపీపీ విధానమే సరైనదని, ఈ పద్ధతిని కొనసాగిస్తూ అంతర్జాతీయ టెండర్లకు వెళ్లండని అప్పట్లో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌(Manmohan Singh) ప్రోత్సహిస్తూ తమకు మద్దతుగా నిలిచారని హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి అన్నారు. ఆయన మద్దతు లేకుంటే ప్రపంచ చరిత్రలో ఒక అరుదైన పీపీపీ మెట్రో ప్రాజెక్టుగా హైదరాబాద్‌ మెట్రో అవతరించేది కాదని, ఆయనకు హైదరాబాద్‌ నగరవాసులు ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మృతికి ఒక ప్రకటనలో ఎన్వీఎస్‌ రెడ్డి సంతాపం తెలిపారు.

అప్పటి ప్రధానిగా ఉన్న డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కొనసాగిన డాక్టర్‌ మాంటెక్‌సింగ్‌ అహ్లువాలియా, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డిల ప్రోద్బలంతో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి(YS Rajasekhar Reddy) ఆదేశాలతో తాము మెట్రోరైల్‌ను పీపీపీ విధానంలో రూపొందించామన్నారు. దీనిని మన్మోహన్‌సింగ్‌ అభినందించారని ఎన్వీఎస్‌ రెడ్డి గుర్తుచేశారు

హైదరాబాద్‌ మెట్రోలో విజయవంతమైన పీపీపీ బిడ్డింగ్‌ విధానంపై అప్పటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మాంటెక్‌సింగ్‌ అహ్లువాలియాకు తాను లేఖ ద్వారా వివరించగా.. దానిపై మన్మోహన్‌సింగ్‌ హైదరాబాద్‌ మెట్రో ఒక దిక్సూచిగా నిలుస్తుందని, దేశంలో ఇతర ప్రాజెక్టులు కూడా ఈ విధానాన్ని అనుసరించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. మేటాస్‌ వైఫ ల్యం ఉదంతంతో అనేకమంది హైదరాబాద్‌ మెట్రోపై విమర్శలు గుప్పించినా.. ఇదే సరైన విధానమంటూ మెట్రో పీపీపీ విధానానికి మద్దతుగా నిలిచారని తెలిపారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *