Hyderabad : ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్ మాల్ – రూ.4.75 కోట్లు స్వాహా, చక్రం తిప్పిన మేనేజర్
Sanathnagar SBI Fraud Case : సనత్ నగర్ ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్‌మాల్ వ్యవహారం బయటికి వచ్చింది. రూ. 4.75 కోట్ల నిధులు స్వాహా అయినట్లు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం…….సనత్ నగర్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ లో మాజీ మేనేజర్ కార్తీక్ రాయ్ 2020 జూన్ 20 నుంచి 203 జూన్ 16 వరకు పని చేశాడు. ఆ సమయంలో బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న వారికి లోన్ రద్దు చేస్తామని చెప్పాడు. దీంతో కొందరికి మళ్ళీ రుణాలు మంజూరు చేశాడు. అయితే ముందు తీసుకున్న అప్పును రద్దు చేయకపోగా ఖాతాదారులకు తెలియకుండా మంజూరు చేసిన లోన్లు థర్డ్ పార్టీ ఖాతాకు నిధులు మళ్ళించాడు.
కొన్ని రోజులకు లోన్ పేరిట స్టేట్ బ్యాంక్ మేనేజర్ చేసిన మోసాన్ని గ్రహించిన బాధితులు మనేజర్ కార్తీక్ రాయ్ ని నిలదీశారు. వారికి సాంకేతిక కారణాల వలన అలా జరిగిందని సాకు చెప్పాడు. రుణాలకు సంబంధించి EMI లు చెల్లిస్తానని వారికి హామీ ఇచ్చాడు. ఇక లోన్ ఖాతాల మూసివేత కోసం రుణ గ్రహీతలు ఇచ్చిన డిమాండ్ డ్రాఫ్ట్లను తాడ్ పార్టీ ఖాతాలకు మళ్ళించాడు. బ్యాంకులోని డిపాజిట్లకు వ్యతిరేకంగా ఓడీ ఖాతాలను తెరిచి డిపాజిట్ మొత్తాన్ని అందులోకి మళ్ళించాడు. మరణించిన ఖాతాదారులకు సంబంధించిన నిధులను కూడా థర్డ్ పార్టీ ఖాతాలకు బదిలి చేశాడు.
ఓటీపీ చెప్పమని….రూ 10 వేలు కాజేశారు
నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లీ లో ప్రజాపాలన దరఖాస్తుల్లో వివరాలను సరి చేస్తామని చెప్పి సైబర్ నేరగాళ్లు ఓ మహిళను మోసం చేశారు. మీ దరఖాస్తు లో వివరాలు తప్పుగా ఉన్నాయని మేము సరి చేస్తామని ఓటిపి చెప్పమని సదరు మహిళను అడగ్గా….. ఆ మహిళ నిజమేనని నమ్మి వారికి ఒటిపి చెప్పడంతో సైబర్ నేరగాళ్లు ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.10 వేలు కాజేశారు.