HYD: డిసెంబర్ 31 రాత్రి నిమిషానికి 1244 బిర్యానీలు ఆర్డర్.. మరి కండోమ్‌లు ఎన్నంటే?

 HYD: డిసెంబర్ 31 రాత్రి నిమిషానికి 1244 బిర్యానీలు ఆర్డర్.. మరి కండోమ్‌లు ఎన్నంటే?

Condom Orders in Swiggy: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు చాలా గ్రాండ్‌గా జరుపుకుంది యువత. అయితే.. చుక్కా, ముక్కాతో గట్టిగానే ఎంజాయ్ చేశారు. అయితే.. ఫుడ్ విషయంలో మాత్రం ఎప్పటిలాగానే తగ్గేదేలే అన్న యువత.. బిర్యానీనే జై కొట్టింది. హైదరాబాద్‌లో నిమిషానికి 1244 బిర్యానీలు ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గీ సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. బిర్యానీలతో పాటు అంతే స్థాయిలో ఇన్‌స్టామార్ట్‌లో కండోమ్‌ల ఆర్డర్లు కూడా వచ్చినట్టు స్విగ్గీ పేర్కొంది.’

Biryani Orders in Swiggy: కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా యువత పార్టీల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో.. మద్యంతో పాటు తినేందుకు స్విగ్గీలో బిర్యానీని కూడా గట్టిగానే ఆర్డర్ చేశారు. డిసెంబర్‌ 31 ఒక్కరోజే హైదరాబాద్‌ నగరంలో నిమిషానికి 1,244 బిర్యానీల ఆర్డర్‌ వచ్చినట్టు ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ తెలిపింది. హైదరాబాదీలు ఏకంగా 4.8 లక్షల బిర్యానీలు ఆర్డర్‌ చేసి.. గత రికార్డులను తిరగరాశారు. గతంలో కంటే 1.6 రేట్లు ఆర్డర్లను ఆందుకున్నట్టు స్విగ్లీ పేర్కొంది. వరల్డ్‌ కప్‌- 2023 ఫైనల్‌ సందర్భంగా కూడా ఈ స్థాయిలో ఆర్డర్లు వచ్చినా.. అప్పుడు వచ్చిన దాని కంటే 1.3 లక్షల ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయని స్విగ్గీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా నాలుగు బిర్యానీలు ఆర్డర్ పెడితే.. అందులో ఒకటి పక్కగా హైదరాబాద్‌ నుంచే కావటం గమనార్హం.

గతేడాదితో పోలిస్తే.. ఫుడ్ డెలివరీ, ఇన్‌స్టా మార్ట్ సేవలు గణనీయంగా నమోదైనట్ట స్విగ్గీ తెలిపింది. చివరి సంవత్సరం ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్‌లను, 2.5 పిజ్జాలను డెలివరీ చేసినట్టు స్విగ్గీ పేర్కొంది. 2024 న్యూఇయర్ వేడుకల సందర్భంగా.. స్విగ్గీ ఫుడ్ డెలివరీ, ఇన్‌స్టామార్ట్‌లో గత రికార్డులన్ని బ్రేక్ అయినట్టు వెల్లడించింది.

డిసెంబర్ 31న రాత్రి సమయంలో 9 నుంచి 10 మధ్యలో.. ఒక గంటలోనే దాదాపు మిలియన్ మంది వినియోగదారులు స్విగ్గీ యాప్‌లో యాక్టివ్‌గా ఉన్నట్టు స్విగ్గీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ సంవత్సరం ఒక మిలియన్ మందికి పైగా ఫుడ్‌ను వేరే వాళ్లకు ఆర్డర్ చేసినట్టు పేర్కొంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *