Hibiscus Hair Oil Benefits : జుట్టు రాలడాన్ని నివారించడానికి మందార నూనెను ప్రయత్నించండి
ఎంత ప్రాధాన్యత ఇస్తామో, జుట్టు పెరుగుదలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. జుట్టు సంరక్షణకు సమయం ఇవ్వకపోతే జుట్టు చాలా త్వరగా పాడైపోతుంది. మందార నూనెతో జుట్టు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
కొన్ని ముఖ్యమైన నూనెలు జుట్టు మెరుపు, జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. రసాయన ఆధారిత నూనెలను ఉపయోగించకుండా, మీ జుట్టుకు తేలికపాటి, మరింత ప్రభావవంతమైన మూలికా నూనెలను పూయడం మంచిది. జుట్టుకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు ఆరోగ్యం కూడా చాలా త్వరగా మెరుగుపడుతుంది.
జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఉపయోగించగల ఉత్తమమైన, అత్యంత ప్రభావవంతమైన నూనెలలో ఒకటి మందార నూనె. మీ ఇంట్లో పెరిగే అందమైన మందార పువ్వు మీ జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఎర్రటి మందార పువ్వులను ముఖ్యమైన నూనెలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ విధంగా, మీరు మీ జుట్టుకు మందార ఆకులు, పువ్వులతో చేసిన నూనెను కూడా ఉపయోగిస్తే, దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
మందార నూనెలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. విటమిన్ ఎ సి, అమైనో యాసిడ్, మీ స్కాల్ప్, హెయిర్‌ను పునరుద్ధరించడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉంది. మందార నూనె జుట్టు మెరుపును పెంచడమే కాకుండా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. తలపై చుండ్రును తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది.
మందార నూనె చాలా ప్రభావవంతంగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే నూనె. ఇందులో ఉండే అమినో యాసిడ్స్, విటమిన్ సి జుట్టు మూలాలు బలంగా మారేలా చేస్తాయి. మందార నూనెను జుట్టుకు రాసుకుని బాగా మర్దన చేస్తే రక్తప్రసరణ పెరిగి జుట్టు పెరుగుతుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడటమే కాకుండా జుట్టు రాలే సమస్య నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది.
కొంతమందికి పొడవాటి జుట్టు ఉన్నప్పటికీ, అది మందంగా ఉండదు. అంటే జుట్టు సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. అలాగే కొందరి వెంట్రుకలు చాలా బలహీనంగా ఉంటాయి. మందార నూనెను ఉపయోగించి బలహీనమైన వెంట్రుకలను కూడా బలోపేతం చేయెుచ్చు. ఇందులో విటమిన్లు మినరల్, ప్రోటీన్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి. జుట్టును రూట్ నుండి బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. తద్వారా జుట్టు విరిగిపోయే సమస్యను తొలగిస్తుంది.
మీరు మార్కెట్లో మందార జుట్టు నూనెను కొనుగోలు చేయవచ్చు. లేదంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
డాబర్ వాటికా మందార నూనె – ఇందులో కొబ్బరి నూనె, మందార నూనె సమాన నిష్పత్తిలో ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
దేవినాజ మందార ఎసెన్షియల్ ఆయిల్ – ఈ నూనెను మందార నూనెతో కొబ్బరి నూనె లేదా బాదం నూనె కలపడం ద్వారా తయారు చేస్తారు. ఇది మీ బలహీనమైన జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది.
మందార ఆమ్లా ఆయిల్ – ఈ నూనెను ఉసిరికాయ ఆకులు, ఇతర మూలికలను మందార నూనెతో కలిపి తయారుచేస్తారు. పోషక విలువలున్న ఈ నూనెను జుట్టుకు రాసుకుంటే జుట్టు రాలే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.