Hanuman Jayanti: హనుమంతుడి ఆశీస్సుల కోసం హనుమంతుడి జయంతి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా..

 Hanuman Jayanti: హనుమంతుడి ఆశీస్సుల కోసం హనుమంతుడి జయంతి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా..

హిందూ పురాణాలలో హనుమంతుని విశ్వాసం, భక్తికి ఉదాహరణగా భావిస్తారు. రామ భక్త హనుమంతుడిని ఆంజనేయ, హనుమంతుడు, మారుతి , భజరంగ భలి వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 12వ తేదీ, 2025 న జరుపుకోనున్నారు. హనుమాన్ జయంతి రోజున కొన్ని పనులు చేయాలి.. కొన్ని పనులు చేయకూడదు. అవి ఏమిటో ఈ రోజున తెలుసుకుందాం.

  • శ్రీ రాముని భక్తుడైన హనుమంతుడిని పూజిస్తూ హనుమాన్ జయంతి వేడుకలను జరుపుకుంటారు. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో ఒకటి ఇది. 2025 ఏప్రిల్ 12 వ తేదీ శనివారం హనుమాన్ జయంతిని ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడానికి భక్తులు రెడీ అవుతున్నారు. ఈ రోజు తన అసమానమైన శారీరక బలం, అచంచలమైన భక్తి , నిస్వార్థ సేవకు ప్రసిద్ధి చెందిన హనుమంతుడి జన్మదినోత్సవం. కేసరి అంజన దేవిల తనయుడు ఆంజనేయుడు. హనుమంతుడు కేసరి అని కూడా పిలుస్తారు. ఆంజనేయస్వామి ధైర్యం, నిస్వార్థ సేవ అంకితభావానికి ప్రతీక. మన దేశంలోని హిందువులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ రోజును హనుమతుండిని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు.
  • హనుమాన్ జయంతి తేదీ, సమయం
  • దృక్ పంచాంగం ప్రకారం చైత్ర మాసం పౌర్ణమి తిథి శనివారం, ఏప్రిల్ 12వ తేదీ, 2025 ఉదయం 03:21 గంటలకు ప్రారంభమై, ఆదివారం, ఏప్రిల్ 13వ తేదీ, 2025 ఉదయం 05:51 గంటలకు ముగుస్తుంది. కనుక హనుమంతుడి జయంతిని పౌర్ణమి రోజు , ఏప్రిల్ 12వ తేదీన జరుపుకోనున్నారు. హిందూ మతంలో ముఖ్యమైన పంగడ కనుక చాలా మంది ఈ రోజు ఉపవాసం ఉంటారు. హనుమంతుడిని అత్యంత భక్తిశ్రద్దలతో పుజిస్తారు.
  • ఈ రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏమిటంటే
  1. ఈ రోజున చేయాల్సిన పనులు: హనుమాన్ జయంతి రోజున కోతులకు బెల్లం తినిపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
  2. హనుమాన్ జయంతి రోజున దానం చేయడం శుభప్రదమని నమ్మకం. ఈ రోజున దానం చేయడం వల్ల సమస్యలు తొలగిపోయి. ప్రశాంతమైన జీవితం లభిస్తుందని నమ్మకం.
  3. హనుమంతుడికి సిందూరం, తమలపాకులు సమర్పించడం శుభప్రదం.
  4. హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి, ముఖ్యంగా సాధకుడు బ్రహ్మ చర్యాన్ని పాటించాలి.
  5. హనుమంతుడిని పూజించేటప్పుడు ఎర్రటి పువ్వులు, దేశీ నెయ్యి లేదా నువ్వుల నూనెను ఉపయోగించాలి.
  • ఈ రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు
  1. హనుమాన్ జయంతి రోజున తామసిక ఆహారం తినకూడదు.
  2. హనుమాన్ జయంతి రోజున, ఏ జంతువునూ ఇబ్బంది పెట్టకూడదు లేదా హాని చేయకూడదు.
  3. హనుమాన్ జయంతి రోజున మాంసాహార ఆహారాన్ని తినొద్దు. మద్యం లేదా మత్తు పదార్థాలు వాడకూడదు.
  4. ఈ రోజున ప్రజలతో గొడవలు పడవద్దు. ఇతరులను అవమాన పరిచేటట్లు ప్రవర్తించరాదు.
  • హనుమాన్ జయంతి అనేది బలం, రక్షణ, దైవిక ఆశీర్వాదాలను కోరుకునే శక్తివంతమైన సందర్భం. ఈ పవిత్రమైన రోజున చేయవలసిన వాటిని పాటించడం, చేయకూడని వాటికి దూరంగా ఉండడం వలన భక్తులకు అంతర్గత శాంతి, హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి. ఉపవాసాలు, ఆలయ సందర్శనలు, మంత్రాలు చదవడం, నిస్వార్థ సేవ చేయడం ద్వారా పండుగను వైభవంగా జరుపుకోవచ్చు. ఈ నియమాలను అనుసరిస్తూ భక్తులు 2025లో హనుమాన్ జనమోత్సవాన్ని సంతృప్తికరంగా, శుభప్రదంగా చేసుకోవచ్చు.
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *