Hanuman Chalisa: జీవితంలో కష్టాలా.. హనుమంతుడి అనుగ్రహం కోసం హనుమాన్ చాలీసాను ఎలా పారాయణం చేయాలంటే..

మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడిన రోజుగా పరిగణించబడుతుంది. అయితే హనుమంతుడిని శనివారం మాత్రమే కాదు రోజు హనుమంతుడిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. అదే సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మనిషి తన జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారని హిందువులు విశ్వసిస్తారు. తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా పారాయణం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమాన్ చాలీసాను ప్రతిరోజూ పారాయణం చేయడం వల్ల జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఇంట్లో హనుమాన్ చాలీసాను ఎలా పారాయణం చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎన్ని రోజులు చేయాలి అనే విషయాలతో పాటు అసలు హనుమాన్ చాలీసాను ఎప్పుడు చదవకూడదో కూడా తెలుసుకుందాం..
హనుమాన్ చాలీసాను ఎప్పుడూ బిగ్గరగా పఠించకూడదు. ఎల్లప్పుడూ నెమ్మదిగా.. మధురమైన స్వరంలో పఠించాలి. ఉచ్చారణలో ఎటువంటి తప్పు జరగకుండా జాగ్రత్త వహించండి. హనుమాన్ చాలీసాను త్వర త్వరగా ముగించాలి అనే ఉద్దేశ్యంతో పారాయణం చేయకూడదు. ప్రతి ద్విపదను అర్థం చేసుకుంటూ పారాయణం చేయాలి.
హనుమాన్ చాలీసా ఎన్నిసార్లు పారాయణం చేయాలి?
హనుమాన్ చాలీసాను 1, 3, 7, 9 లేదా 11 సార్లు పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. హనుమాన్ చాలీసాను 7, 21 రోజులు లేదా 41 రోజులు నిరంతరం పఠించడం ద్వారా వ్యక్తి కోరిన అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.