Gatte Ka Pulao: రాజస్థానీ స్పెషల్ వంటకం గట్టే కా పులావ్.. సింపుల్గా వండేయొచ్చు..
Gatte Ka Pulao: రాజస్థానీ స్పెషల్ వంటకం గట్టే కా పులావ్ ఎప్పుడైనా ప్రయత్నించారా. కాస్త వెరైటీ రుచితో నచ్చేస్తుంది. దాని తయారీ ఎలాగో వివరంగా చూసేయండి.
Gatte Ka Pulao: రాజస్థానీ స్పెషల్ వంటకం గట్టే కా పులావ్ ఎప్పుడైనా ప్రయత్నించారా. కాస్త వెరైటీ రుచితో నచ్చేస్తుంది. దాని తయారీ ఎలాగో వివరంగా చూసేయండి.
గట్టే కా పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
1 కప్పు శనగపిండి
పావు చెంచా వాము
అరచెంచా కారం
అరచెంచా ధనియాల పొడి
2 చెంచాల పెరుగు
1 చెంచా వంటనూనె
తగినంత ఉప్పు
1 కప్పు బియ్యం
1 చెంచా నెయ్యి
1 ఉల్లిపాయ, ముక్కలు
1 టమాటా, ముక్కలు
పావు కప్పు బటానీ
అరచెంచా జీలకర్ర
4 పచ్చిమిర్చి
2 ఎండుమిర్చి
అరచెంచా పసుపు
1 చెంచా కారం
1 బిర్యానీ ఆకు
3 లవంగాలు
అంగుళం దాల్చిన చెక్క ముక్క
సగం చెంచా గరం మసాలా
కొద్దిగా కొత్తిమీర తరుగు
గట్టే కా పులావ్ తయారీ విధానం:
- ఒక పెద్ద గిన్నెలో శనగపిండి, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, పెరుగు, నూనె వేసుకోవాలి. దీన్ని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టి పిండిలా కలుపుకోవాలి.
- ఈ పిండిని సమబాగాలుగా చేసుకుని మందంగా, పొడవుగా సిలిండ్రికల్ ఆకారంలో పిండిని తాల్చుకోవాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని మరిగాక వీటిని వేసుకోవాలి. ఒక పదినుంచి పదిహేను నిమిషాల పాటూ వీటిని ఉడకనివ్వాలి.
- అవి ఉడికి పోగానే నీళ్ల నుంచి బయటికి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని గట్టే అంటాం. ఇప్పుడు పులావ్ రెడీ చేసుకోవాలి.
- ఒక కడాయి పెట్టుకుని వేడెక్కాక నెయ్యి వేసుకోవాలి. అది వేడెక్కాక జీలకర్ర, లవంగాలు, యాలకులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం వేసుకుని వేగనివ్వాలి.
- ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, బటానీ కూడా వేసుకుని కాస్త రంగు మారేదాకా వేయించుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకుని మెత్తబడేదాకా మూత పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఉడికించుకున్న అన్నం, కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
- చివరగా కట్ చేసి పక్కన పెట్టుకున్న గట్టే కూడా వేసుకుని కనీసం పది నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. కొత్తిమీర చల్లుకుని దించేసుకుంటే సరి. గట్టే కా పులావ్ రెడీ అయినట్లే.