Ganesh Immersion live Updates: హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన గణేష్ శోభాయాత్ర

Ganesh Immersion live Updates: హైదరాబాద్‌లో గణేష్ విగ్రహాల శోభయాత్ర ప్రారంభమైంది. వీధివీధి నుంచి గణనాథుడి విగ్రహాలు నిమజ్జనానికి బారులు తీరాయి. రేపు ఉదయం వరకు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. ఖైరతాబాద్, బాలాపూర్ విగ్రహాలు కూడా నిమజ్జనం కోసం బయల్దేరాయి.
Thu, 28 Sep 202307:08 AM IST
మల్కాజ్‌గిరి పిఎస్ పరిధిలో నిమజ్జనం…
సఫిల్‌గూడ ట్యాంక్ గణేష్ విగ్రహ నిమజ్జనం మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఉంటుంది.
మెట్టుగూడ టి జంక్షన్ (హైదరాబాద్ నగర సరిహద్దులు) : మెట్టుగూడ నుంచి మల్కాజిగిరి ఎక్స్ రోడ్డు వైపు భారీ వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలు లాలాపేట్ వైపు మళ్లిస్తారు. ప్రజలు లాలాపేట్, ZTC-HB కాలనీ- రమాదేవి-ECIL మీదుగా నేరేడ్‌మెట్‌కు ప్రయాణించవచ్చు.
ఆనంద్‌బాగ్ ఎక్స్ రోడ్ : మల్కాజిగిరి ఎక్స్ రోడ్ నుంచి సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించరు. సఫిల్‌గూడ జంక్షన్, ఉత్తమ్ నగర్ , ZTC వైపు ట్రాఫిక్ ను మళ్లిస్తారు. ప్రజలు వినాయక్ నగర్ వైపు వెళ్లాలని అనుకుంటే ZTC-మౌలాలి కమాన్, రమాదేవి- ECIL-రాధిక X రోడ్ – నేరేడ్‌మెట్- వినాయక్ నగర్ మీదుగా వెళ్లవచ్చు.
ఉత్తమ్ నగర్ RUB – AOC ప్రాంతం నుంచి సాధారణ ట్రాఫిక్ అనుమతించరు. ఆనంద్ బాగ్ , గౌతమ్ నగర్ వైపు మళ్లిస్తారు. సాధారణ ప్రజానీకం
మల్కాజిగిరి వైపు వెళ్లాలనుకునే వారు గౌతమ్ నగర్ – అనుటెక్స్ , మల్కాజిగిరి ఎక్స్ రోడ్ మీదుగా వెళ్లవచ్చు.
పార్కింగ్ స్థలాలు ఇవే…
నిమజ్జనం చూసేందుకు వచ్చే సందర్శకులు తమ వాహనాలను జ్యోతి క్లబ్/సరస్వతి శిశు మందర్, ZPHS పాఠశాల సరూర్‌నగర్, పోస్టాఫీసు సమీపంలో (గాంధీ విగ్రహం దగ్గర) పార్కింగ్ చేసుకోవచ్చు. ఇందిర ప్రియదర్శిని పార్క్ వద్ద అధికారుల వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇతర వాహనాలను పార్కింగ్ చేయడానికి అనుమతించరు.
i) గణేష్ విగ్రహాల నిమజ్జనం తర్వాత అన్ని ఖాళీ వాహనాలు ఇందిర ప్రియదర్శిని పార్కు, సరూర్‌నగర్ పాత పోస్టాఫీసు X రోడ్, కర్మన్‌ఘాట్ వైపు లేదా సరూర్‌నగర్ పోస్టాఫీసు వైపు మాత్రమే వెళ్లాలి.
ii) సరూర్‌నగర్ పోస్టాఫీసు మీదుగా సరూర్‌నగర్ ట్యాంక్ వైపు వాహనాలు అనుమతించరు.
Thu, 28 Sep 202307:07 AM IST
హైదరాబాద్‌లో రూట్ ఇదే…
హైదరాబాద్ వైపు నుంచి వచ్చే గణేష్ విగ్రహాలను తీసుకువెళ్లే వాహనాలకు మార్గం
చాదర్‌ఘాట్, మలక్‌పేట్ సైడ్ వాహనాలు మూసారంబాగ్ టీవీ టవర్ ఎక్స్ రోడ్డు వైపు వెళ్లాలి. కోణార్క్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ దగ్గర యూ టర్న్ తీసుకోని గడ్డి అన్నారం ఎక్స్ రోడ్డు వద్ద లెఫ్ట్ తీసుకోవాలి. శివ గంగా థియేటర్, శంకేశ్వర్ బజార్ జంక్షన్ వద్ద లెఫ్ట్ తీసుకుని సరూర్‌నగర్ ట్యాంక్ వైపు వెళ్లాలి.
అంబర్‌పేట్, మూసారాంబాగ్ సైడ్ వాహనాలు మూసారాంబాగ్ టీవీ టవర్ X రోడ్ వద్ద లెఫ్ట్ తీసుకుని దిల్ సుఖ్ నగర్ వైపు వెళ్లాలి. కోణార్క్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ దగ్గర యూటర్న్ తీసుకుని గడ్డి అన్నారం ఎక్స్ రోడ్ వద్ద లెఫ్ట్ తీసుకోవాలి. శివగంగ థియేటర్, శంకేశ్వర్ బజార్ జంక్షన్ వద్ద లెఫ్ట్ తీసుకుని సరూర్‌నగర్ ట్యాంక్ వైపు వెళ్లాలి.
Thu, 28 Sep 202307:07 AM IST
సాగర్ రోడ్డులో ఆంక్షలు ఇవే…
నాగార్జున సాగర్ రోడ్డు వైపు వాహనాలు.. ఎల్బీ నగర్ జంక్షన్ మీదుగా కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, వెంకటాద్రి థియేటర్, J.C బ్రదర్స్ షోరూమ్ తర్వాత ఎడమ మలుపు తీసుకుని శివ గంగా తర్వాత మళ్లీ లెఫ్ట్ తీసుకుని సరూర్‌నగర్ ట్యాంక్ వైపు వెళ్లాలి.
కర్మన్‌ఘాట్ వైపు (శ్రీనివాస కాలనీ, మధురా నగర్, బైరామల్‌గూడ, దుర్గా నగర్)
వాహనాలు ఎల్బీ నగర్ జంక్షన్, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, వెంకటాద్రి థియేటర్ J.C బ్రదర్స్ షోరూమ్, శివ గంగా థియేటర్ తర్వాత ఎడమవైపు మలుపు తీసుకుని సరూర్‌నగర్ ట్యాంక్ వైపు మరలాలి.
Thu, 28 Sep 202307:06 AM IST
సరూర్ నగర్ మార్గంలో ఆంక్షలు
వనస్థలిపురం నుంచి వచ్చే వాహనాలు-పనామా గోడౌన్ X రోడ్, ఎల్బీ నగర్ మీదుగా కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, వెంకటాద్రి థియేటర్, జేసీ బ్రదర్స్ తర్వాత ఎడమ వైపు శివగంగా థియేటర్ వద్ద లెఫ్ట్ తీసుకుని సరూర్‌నగర్ ట్యాంక్ వైపు వెళ్లాలి.
సరూర్‌నగర్ వాహనాలు – కొత్తపేట ఎక్స్ రోడ్డు మీదుగా వెళ్లి లైఫ్ట్ తీసుకోవాలి. దిల్ సుఖ్ నగర్, వెంకటాద్రి థియేటర్, J.C బ్రదర్స్ షోరూమ్ వద్ద లెఫ్ట్ తీసుకుని శివ గంగా థియేటర్ వద్ద మళ్లీ లెఫ్ట్ తీసుకుని సరూర్‌నగర్ ట్యాంక్ వైపు వెళ్లాలి
Thu, 28 Sep 202307:05 AM IST
హయత్ నగర్, వనస్థలిపురం మార్గాల్లో ఇలా…
హయత్‌నగర్ నుంచి వచ్చే వాహనాలు ఎల్బీ నగర్ జంక్షన్, కొత్తపేట మీదుగా వెళ్లాలి. దిల్ సుఖ్ నగర్, వెంకటాద్రి థియేటర్, J.C బ్రదర్స్ షోరూమ్ తర్వాత ఎడమ వైపు తిరగాలి. శివ గంగా థియేటర్ వద్ద లెఫ్ట్ తీసుకుని సరూర్‌నగర్ ట్యాంక్ వైపు మరలాలి.
ఎల్‌బీ నగర్ నుంచి వచ్చే గణేశ్ నిమజ్జన వాహనాలు ఎల్బీ నగర్ జంక్షన్, కొత్తపేట మీదుగా వెళ్లాలి. దిల్ సుఖ్ నగర్, వెంకటాద్రి థియేటర్, J.C బ్రదర్స్ షోరూమ్, తర్వాత ఎడమ మలుపు తీసుకోవాలి. శివ గంగా థియేటర్ వద్ద ఎడమవైపు సరూర్‌నగర్ ట్యాంక్ కు వెళ్లాలి.
Thu, 28 Sep 202307:05 AM IST
ఉదయం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. సరూర్‌నగర్ ట్యాంక్ లో గణేశ్ విగ్రహ నిమజ్జన ప్రక్రియ ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీసుల నియంత్రణలో ఉంటుంది.
Thu, 28 Sep 202307:04 AM IST
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జన వేడుకలకు అధికార, పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచే గణేశ్ విగ్రహాలు గంగమ్మ ఒడికి బయలుదేరనున్నాయి. దీంతో పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గణేశ్ శోభాయాత్రలు సాగే దారుల్లో సాధారణ వాహనాల రాకపోకలకపై ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.
Thu, 28 Sep 202307:00 AM IST
అర్థరాత్రి వరకు మెట్రో రైళ్లు
గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైళ్లు అర్థరాత్రి వరకు పనిచేయనున్నాయి. రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.
Thu, 28 Sep 202306:56 AM IST
హైదరాబాద్‌లో కోలాహలం
గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో కోలాహలం నెలకొంది. అన్ని ప్రాంతాల నుంచి గణేష్ విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు సాగుతున్నాయి. నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్ వద్ద పలు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 5 ప్రాంతాల్లో 36 క్రేన్లను ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 64 చెరువుల్లో నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. నగరంలో 20వేల సిసి కెమెరాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Thu, 28 Sep 202306:54 AM IST
బాలాపూర్ లడ్డూ వేలంపై ఆసక్తి
వినాయక చవితి సందర్భంగా నిర్వహించే బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది 25లక్షలకు పైగా ధర లభిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు గణేష్ నిమజ్జనం సందర్భంగా పెద్ద ఎత్తున గజఈతగాళ్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. హుస్సేన్ సాగర్ లో దాదాపు 200మందిని గణేష్ నిమజ్జనం కోసం వినియోగిస్తున్నారు.
Thu, 28 Sep 202306:52 AM IST
గేట్ నంబర్ 4లో ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనం
శోభయాత్ర కోసం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 25వేల మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. నగరం నలుమూలల నుంచి గణేష్ విగ్రహాలు నిమజ్జనం కోసం బయల్దేరాయి. మధ్యాహ్నం 12లోపు ఎన్టీఆర్ ఘాట్ గేట్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ గణేషుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.