Ganesh Chaturthi 2025: ఈ సమయంలో గణపతి పూజ చేస్తే పట్టిందల్లా బంగారమే.. శుభ ముహూర్తం, పూజా విధానం

 Ganesh Chaturthi 2025: ఈ సమయంలో గణపతి పూజ చేస్తే పట్టిందల్లా బంగారమే.. శుభ ముహూర్తం, పూజా విధానం

ఈ ఏడాది ఆగస్టు 23న వినాయకచవితి పండగ వచ్చింది. ఈ నేపథ్యంలో  గణేష్ చతుర్థి  పూజా విధానం, శుభ సమయం, నైవేద్యాల జాబితా,  ఏ  మంత్రాన్ని పఠించాలి అనే విషయాలను ఇక్కడ  తెలుసుకుందాం…

నగరంలో వినాయక చవితి పండగ(Ganesh Chaturthi 2025) సందడి మొదలైంది. 10 రోజుల పాటు ఘనంగా జరిగే  గణపతి ఉత్సవాల కోసం వినాయకుడి విగ్రహాలు ముస్తాబవుతున్నాయి. ప్రతి ఊరు, ప్రతి గల్లీ బొజ్జ గణపయ్య విగ్రహాలతో దర్శనమిస్తాయి. పచ్చని ఆకులతో పందిళ్లు వేసి గణపయ్యను ప్రతిష్టిస్తారు.  పిల్లల, పెద్దలు ఆ మండపాల దగ్గర ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ పండుగ సందడిని మరింత పెంచుతారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఇష్టంగా, కోలాహలంగా జరుపుకునే పండుగల్లో ఈ వినాయకచవితి ఒకటి.

హిందూ క్యాలెండర(Hindu Calender) ప్రకారం ప్రతీ ఏడాది భాద్రపద మాసంలో శుక్ల పక్ష చతుర్థి నాడు వినాయకచవితి పండగను జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 23న వినాయకచవితి పండగ వచ్చింది. ఈ నేపథ్యంలో  గణేష్ చతుర్థి  పూజా విధానం, శుభ సమయం, నైవేద్యాల జాబితా,  ఏ  మంత్రాన్ని పఠించాలి అనే విషయాలను ఇక్కడ  తెలుసుకుందాం…

గణపతి పూజను శుభముహూర్తంలో చేయడం మంచి ఫలితాలను అందిస్తుంది. కావున పూజ చేయడానికి శుభ ముహూర్తాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

చతుర్థి ప్రారంభం

చతుర్థి తిథి ఆగస్టు 26 మధ్యాహ్నం 01:54 గంటలకు ప్రారంభమై..
ఆగస్టు 27, 2025 మధ్యాహ్నం 03:44 గంటలకు ముగుస్తుంది.

శుభ  ముహూర్తం

మధ్యాహ్నం 11:05 AM నుంచి  01:40 PM వరకు వినాయకుడికి పూజకు మంచి ముహూర్తంగా పండితులు చెబుతున్నారు.

పూజా ఆచారాలు

  • విగ్రహ స్థాపన: ఒక పీటపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి, దానిపై గణపతి విగ్రహాన్ని ఉంచండి. ఆ తర్వాత విగ్రహాన్ని శుభ్రమైన నీటితో తుడిచి, గంధం, కుంకుమ, పసుపు, పూలతో అలంకరించండి.
  • సంకల్పం: పూజ ప్రారంభించే ముందు, మీ మనసులో పూజ యొక్క ఉద్దేశాన్ని తలచుకోండి. ఉదాహరణకు, ‘గణపతి అనుగ్రహం కోసం ఈ పూజ చేస్తున్నాను’ అని అనుకోండి.
  • ప్రతిష్టాపన: గణపతి విగ్రహానికి ప్రాణ ప్రతిష్టాపన చేయండి.
  • పూజ:గంగాజలం లేదా శుభ్రమైన నీటితో అభిషేకం చేసి, కొత్త వస్త్రం లేదా జంధ్యం సమర్పించండి.
  • నైవేద్యం: ఉండ్రాళ్ళు, మోదకాలు, లడ్డూలు, పానకం, పాయసం లాంటి నైవేద్యాలు పెట్టండి.
  • పత్రి పూజ: గణపతికి ఇష్టమైన 21 రకాల పత్రాలతో (ఆకులతో) పూజ చేయండి.
  • ఆరతి: చివరగా, కర్పూరంతో లేదా నెయ్యితో దీపం వెలిగించి, గణపతికి హారతి ఇవ్వండి.
  • ప్రార్థన:మీ కోరికలను గణపతికి విన్నవించుకోండి, పూజలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించమని వేడుకోండి.

గణపతి పండగ రోజున  ఉదయాన్నే నిద్రలేచి స్నానం  చేసిన తర్వాత.. ఇంట్లోని ఆలయంలో దీపం వెలిగించాలి. ఆ తర్వాత  గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి..  గంగాజలంతో అభిషేకం చేయండి. అనంతరం  గణేశుడికి సింధూరం పెట్టి.. పువ్వులు, దూర్వా గడ్డిని సమర్పించండి. దీని తరువాత, గణేశుని హారతిచ్చి నైవేద్యం  కూడా సమర్పించండి. మోదకాలు లేదా లడ్డూ గణపయ్యకు నైవేద్యంగా పెట్టండి.  అలాగే పూజ చేసేటప్పుడు ”ఓం గన్ గణపతయే నమః”  అనే మంత్రాన్ని జపించండి.

పూజా సామగ్రి జాబితా

గణేశుడి పూజకు కావాల్సిన సామాగ్రి..  విగ్రహం, ఎర్రటి వస్త్రం, దూర్వం, పవిత్ర దారం, కలశం, కొబ్బరికాయ, పంచామృతం, పంచమేవ, గంగాజల్, రోలి, మౌళి ఎరుపు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *