Everyday Cycling Benefits : ప్రతిరోజూ సైకిల్ తొక్కండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి

 Everyday Cycling Benefits : ప్రతిరోజూ సైకిల్ తొక్కండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి

Everyday Cycling : ఈ బిజీ బిజీ జీవనశైలిలో శరీరానికి వ్యాయామం అవసరం. అలా కుదరకపోతే.. స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేసేందు వెళ్లండి. ఇటు ఆరోగ్యానికి మంచిది.. అటు ఎంజాయ్ మెంట్ కూడా ఉంటుంది.

గతంలో సైకిల్ కూడా రవాణా మార్గంగా ఉండేది. ఇప్పుడు అభివృద్ధి చెందడంతో దాని ఉపయోగం క్రమంగా తగ్గిందని చెప్పవచ్చు. నేడు కేవలం కొన్ని గృహాలు మాత్రమే ముఖ్యంగా పిల్లలు క్రీడలు లేదా వినోదం కోసం మాత్రమే సైకిళ్లను ఉపయోగిస్తున్నారు.

అయితే సైకిల్(Cycling) తొక్కడం అత్యుత్తమ, సులభమైన వ్యాయామం అని చెప్పాలి. సైక్లింగ్ శరీర భాగాలను, శరీర బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. నేటి వేగవంతమైన, యాంత్రిక ప్రపంచంలో పర్యావరణ అనుకూలతతో పాటు.. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నడక, వ్యాయామం ఎంత ముఖ్యమో సైకిల్ తొక్కడం కూడా అంతే ముఖ్యం. రోజువారీ సైక్లింగ్ శరీరానికి వివిధ ప్రయోజనాలను అందిస్తుంది. దాని ప్రయోజనాలు ఏమిటో చూడవచ్చు.

సైకిల్ తొక్కడం వల్ల చేతులు, కాళ్లు, ఎముకలు, కండరాలు బలపడతాయి. అంతేకాకుండా, వెంటిలేషన్ వాతావరణంలో ఉదయాన్నే సైక్లింగ్ చేయడం వల్ల స్వచ్ఛమైన గాలి అందుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

సైక్లింగ్ మన హృదయ స్పందన రేటు మెరుగ్గా పని చేస్తుంది. ఇది శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి(Weight Loss) దారితీస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా సైకిల్ తొక్కాలి.

రోజూ సైకిల్ తొక్కడం వల్ల శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ తగ్గి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఎక్కువగా సైక్లింగ్ చేసేవారిలో సానుకూల ఆలోచనలు ఉంటాయని, ఆనందంగా కనిపిస్తారనేది మానసిక శాస్త్రజ్ఞులు అంటున్నారు.

రెగ్యులర్ సైకిల్ తొక్కడం వల్ల శరీరం స్టామినా పెరుగుతుంది. పిల్లలకు ప్రతిరోజూ సైకిల్‌పై శిక్షణ ఇవ్వడం వల్ల వారి మెదడు పనితీరు, ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది. వారి ప్రతిభను బహిర్గతం చేయవచ్చు.

క్రమం తప్పకుండా ఓ పద్ధతి ప్రకారం ఇలా జరగడం వలన మన శ్వాసక్రియ మెరుగుపడుతుంది. గుండె, శ్వాస సంబంధ సమస్యలు దూరమవుతాయి. సైకిల్‌ తొక్కడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది దీంతో శరీర బరువును కూడా వేగంగా తగ్గించుకోవచ్చు. అధిక శరీర బరువుతో ఇబ్బందులు పడేవారికి సైక్లింగ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

రోజూ కనీసం 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే.. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 50 శాతం వరకు తగ్గుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక సైకిల్‌ తొక్కడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. సైకిల్ తొక్కడం వల్ల దాదాపుగా శరీరంలోని అన్ని కండరాలు పనిచేస్తాయి. దీంతో కండరాలు పనులు చేయడానికి అనువుగా మారడంతో పాటు దృఢంగా తయారవుతాయి.

రోజూ సైక్లింగ్ చేయడం వలన క్రమంగా శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది. దీంతో ఎక్కువసేపు మీరు మీ భాగస్వామితో శృంగారాన్ని ఆస్వాదించగలుగుతారు. మీ శరీరంలోని మజిల్స్ అన్నీ ఉత్తేజితమై మీరు శారీరకంగానే కాకుండా మానసిక దృఢత్వాన్ని పొందుతారు.

సైకిల్ తొక్కే వారిలో జీవక్రియలు మెరుగుపడతాయి. దీంతో శరీరం శక్తిని సక్రమంగా వినియోగించుకుంటుంది. రోజంతా యాక్టివ్ గా ఉంటారు. కీళ్లు, మోకాళ్లు, ఎముకలు దృఢంగా మారుతాయి. సైక్లింగ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రోగనిరోధకశక్తి(Immunity) పెరుగుతుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.

ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇంధన ధరలు అధికంగా పెరుగుతున్నాయి.. వీలైనప్పుడల్లా తక్కువ దూరం సైకిల్ తొక్కడం అలవాటు చేసుకోండి.. ఇటు ఆరోగ్యానికి అటు మీ జేబుకు మంచిది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *