EMRS Recruitment Key: ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ 10,391 ఉద్యోగాలు.. రాత పరీక్ష కీ విడుదల.. లింక్‌ ఇదే

 EMRS Recruitment Key: ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ 10,391 ఉద్యోగాలు.. రాత పరీక్ష కీ విడుదల.. లింక్‌ ఇదే

Eklavya Model Residential School : ఈఎంఆర్‌ఎస్‌ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఆన్సర్‌ కీ విడుదలైంది

EMRS Recruitment 2023 : దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో (EMRS) టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. రెండు వేర్వేరు నోటిఫికేషన్లతో మొత్తం 10,391 మంది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని భర్తీ చేసేందుకు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా.. ఈఎంఆర్‌ఎస్‌ నియామక రాత పరీక్షల కీలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో జనవరి 6వ తేదీలోగా కీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్సర్‌ కీపై అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చు. ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్‌ డిసెంబర్‌ 16, 17, 23, 24 తేదీల్లో ప్రధాన కేంద్రాల్లో జరిగిన విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల (EMRS)లో ఖాళీగా ఉన్న 10,391 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ప్రిన్సిపల్/ పీజీటీ/ జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్/ ల్యాబ్‌ అసిస్టెంట్‌/ టీజీటీ/ హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు రాత పరీక్షకు సంబంధించిన ఆన్సర్‌ కీ, తదితర వివరాలను https://emrs.tribal.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *