Egg Toast: చీజీ ఎగ్ టోస్ట్ రెసిపీ.. ఒక్కసారి తింటే వదలరు..

Egg Toast: అల్పాహారంలోకి సింపుల్ గా, రుచికరంగా చేసుకునే ఎగ్ టోస్ట్ తయారీ చాలా సులువు. దాన్నెలా తయారు చేసుకోవాలో చూసేయండి.
అల్పాహారంలోకి సులువుగా చేసుకునే ఆప్షన్లకోసం చూస్తే గనక ఒకసారి ఈ ఎగ్ టోస్ట్ ప్రయత్నించండి. అయిదే అంటే అయిదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారు. దాన్నెలా తయారు చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
3 గుడ్లు
4 నుంచి 5 స్లైసుల బ్రెడ్ లేదా టోస్ట్
1 చెంచా బటర్
2 చెంచాల ఉల్లిపాయ ముక్కలు
2 చెంచాల ఉల్లికాడలు, ముక్కలు
2 చెంచాల టమాటా ముక్కలు
2 పచ్చిమిర్చి, సన్నని తరుగు
పావు టీస్పూన్ పసుపు
1 చెంచా చిల్లీ ఫ్లేక్స్
తగినంత ఉప్పు
2 చెంచాల చీజ్ తురుము
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో గుడ్లు పగలగొట్టుకోవాలి. ఫోర్క్ సాయంతో సొనను బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, పసుపు, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని బటర్ వేసుకుని వేడి చేసుకోవాలి. బ్రెడ్ లేదా టోస్ట్ ను తయారుచేసుకున్న గుడ్డు సొనలో రెండు వైపులా ముంచుకుని పెనం మీద పెట్టుకోవాలి.
రెండు వైపులా బటర్ లేదా నూనె వేసుకుని బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న సొనను టోస్ట్ మీద మరింతగా వేసుకుని కాల్చుకోవచ్చు.
ఇప్పుడు చివరగా చీజ్ తురుము వేసుకుని ఒక నిమిషం మూత పెట్టి తీసేసుకుంటే చాలు.
ఈ వేడి వేడి ఎగ్ టోస్ట్ ను సాస్ తో లేదా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.