Dy CM Pawan: పవన్ క్యాంప్ ఆఫీస్ పై డ్రోన్ ఎగురవేసింది వాళ్లే.. అడిషనల్ ఎస్పీ సంచలన ప్రకటన!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీసుపై డ్రోన్ ఎగురవేసిన కేసుపై అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవి కుమార్ తాజాగా కీలక ప్రకటన చేశారు. ఫైబర్ నెట్ అధికారులు ఈ డ్రోన్ ఎగురవేశారని గుర్తించినట్లు చెప్పారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ ఎగిరిన వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. జనసేన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ప్రత్యేక టీమ్ లు అన్ని కోణాల్లో విచారణ జరిపాయి. ఈ ఘటనపై అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవి కుమార్ తాజాగా కీలక ప్రకటన చేశారు. మంగళగిరి ప్రాంతంలో ట్రాఫిక్, శానిటేషన్, రోడ్లు తదితర అంశాలపై చేస్తున్న పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఫైబర్ నెట్ అధికారులు డ్రోన్ ఎగురవేశారని చెప్పారు. ఏపీ ఫైబర్ నెట్ అధికారులతో చర్చించి నిర్ధారణకు వచ్చినట్లు