Drumsticks | మునక్కాయలను తరచూ తినడం లేదా.. అయితే ఈ లాభాలను మీరు కోల్పోయినట్లే..!

మునక్కాయలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. మునక్కాయలతో ఎలాంటి కూర చేసినా సరే అందరూ ఇష్టంగానే తింటారు. వీటితో టమాటా కూర లేదా పులుసు చేసి తినవచ్చు.
Drumsticks | మునక్కాయలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. మునక్కాయలతో ఎలాంటి కూర చేసినా సరే అందరూ ఇష్టంగానే తింటారు. వీటితో టమాటా కూర లేదా పులుసు చేసి తినవచ్చు. చారులో కూడా మునక్కాయలను వేస్తుంటారు. అయితే ఇవి కేవలం రుచిని మాత్రమే కాదు, మనకు పోషకాలను కూడా అందిస్తాయి. మునక్కాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మునక్కాయల్లో మన శరీరానికి అవసరం అయ్యే అనేక విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనల్ని రోగాల నుంచి రక్షిస్తాయి. ఇన్ఫెక్షన్లు నయం అయ్యేలా చేస్తాయి. కనుక మునక్కాయలను తరచూ తినాలని చెబుతున్నారు.
షుగర్ అదుపులో ఉంటుంది..
డయాబెటిస్ ఉన్నవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. మునక్కాయలను తింటే శరీరం ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కనుక ఈ కాయలను తింటే సీజనల్‌గా వచ్చే ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కాయల్లో క్యాల్షియం, ఐరన్ కూడా అధికంగానే ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. మునక్కాయల్లో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. ఈ కాయలను తింటే ఫోలిక్ యాసిడ్ లభించి శిశువు ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పుట్టుక లోపాలు రాకుండా నివారించవచ్చు.
బి విటమిన్లకు నిలయం..
మునక్కాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ కాయల్లో ముఖ్యమైన బి విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా నియాసిన్, రైబోఫ్లేవిన్, విటమిన్ బి12 అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ కాయలను తరచూ తింటే విటమిన్ల లోపం ఏర్పడకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా విటమిన్ బి12 లోపం తొలగిపోతుంది. మునక్కాయల్లో అధికంగా ఉండే ఫైబర్ గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. మునక్కాయల్లో ఉండే యాంటీ బయోటిక్ గుణాలు శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో కణాలు ఆక్సిజన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి. దీని వల్ల రక్తం శుద్ధి అవుతుంది.
శృంగార సమస్యలు దూరం..
మునక్కాయల్లో యాంటీ కోవిడ్ లక్షణాలు ఉంటాయి. ఈ కాయలను తింటే కోవిడ్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని గతంలోనే సైంటిస్టులు వెల్లడించారు. మునక్కాయలను తినడం వల్ల దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాస నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గాలి సరిగ్గా ఆడుతుంది. మునక్కాయల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. తరచూ ఈ కాయలను తింటే నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం పొందవచ్చు. మునక్కాయలను తరచూ తింటే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. నపుంసకత్వ. సమస్య పోతుంది. మహిళలకు కూడా ఇవి మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే జింక్ నెలసరి సక్రమంగా వచ్చేలా చేస్తుంది. ఇలా ఈ కాయలతో అనేక లాభాలను పొందవచ్చు. కనుక వీటిని తరచూ తినడం మరిచిపోకండి.